Sports

Mumbai Indians Vs Delhi Capitals WPL 2024 MI Defeat DC By 4 Wickets


 WPL 2024  MI defeat DC by 4 wickets:  ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం. మొదటి అయిదు బంతులకు ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి బంతికి అయిదు పరుగులు చేస్తే విజయం. అప్పటికే మంచి ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ కూడా పెవిలియన్‌ చేరింది. ఇక ఢిల్లీ జట్టు విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సజన చివరి బంతికి సిక్స్‌ కొట్టిృ… డిపెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైకి అదిరిపోయే విజయాన్ని అందించింది. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌ జరిగిన తీరిది. క్రికెట్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌… చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగింది.
మ్యాచ్‌ సాగిందిలా..
మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)ను ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.  అలిస్‌ క్యాప్సీ (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75), జెమీమా రోడ్రిగ్స్‌ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) ధాటిగా ఆడారు. సివర్‌ బ్రంట్‌, అమేలియా కెర్‌ చెరో 2 వికెట్లు తీశారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది.  ఛేదనలో రెండో బంతికే మాథ్యూస్‌ హీలీ వికెట్‌ పడినా… ముంబై లక్ష్యం దిశగా సాగింది. యాస్తిక భాటియా 45 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55 పరుగులు చేయడంతో ముంబై తేలిగ్గానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అనిపించింది.  అమేలియా 24 పరుగులతో కలిసి ఎదురుదాడి చేసి ముంబైలో ఆశలు రేపింది. కానీ అమేలియా పెవిలియన్‌ చేరడంతో ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. 

చివరి ఓవర్‌లో 12 పరుగులు
ముంబై గెలవాలంటే చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 12 పరుగులు కావాలి. క్యాప్సీ తొలి బంతికే పూజను అవుట్‌ చేసింది. అయిదో బంతికి హర్మన్‌ప్రీత్‌ను కూడా ఔట్‌ చేయడంతో ఢిల్లీ విజయం ఖాయంగా కనిపించింది. తొలి 5 బంతుల్లో 7 పరుగులిచ్చిన క్యాప్సీ… మంచి బంతులతో ఆకట్టుకుంది. చివరి బంతికి 5 రన్స్‌ అవసరమగా.. సజన (6 నాటౌట్‌) స్టన్నింగ్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేసింది. హర్మన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 

అదిరిపోయిన ఆరంభ వేడుకలు
మ్యాచ్‌కు ముందు లీగ్‌ ఆరంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్లు షారుక్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా క్రికెటర్లను ఉత్సాహపరించేందుకు బాలీవుడ్ స్టార్స్ తరలివచ్చారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ పర్ఫార్మెన్స్‌లతో చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. సినిమా పాటలకు సినీ తారలు చేసిన డ్యాన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముంబై జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో పాటు మిగతా జట్ల సారథులను షారుక్ ఖాన్ పరిచయం చేశాడు. వీరిని ప్రత్యేక వాహనంలో స్టేడియంలో తిప్పారు. అనంతరం ఐదు జట్ల కెప్టెన్‌లతో కలిసి బాలీవుడ్ బాద్‌షా స్టెప్పులు వేసి.. ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాడు. డబ్ల్యూపీఎల్-2 ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధమాల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.



Source link

Related posts

BAN vs AUS T20 World Cup 2024 Australia beat Bangladesh by 28 runs DLS method

Oknews

ఉప్పల్ లో ఉప్పెన…వైజాగ్ లో సునామీ.!

Oknews

India Vs England 4th Test Day 1 Joe Root Century Takes England To 302by 7 At Stumps

Oknews

Leave a Comment