కియారా అడ్వాణీ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్, కియారా ఈమధ్య మీడియాతో తన చిన్న నాటి జ్ఞాపకాలను పంచుకుంది. కియారా మాట్లాడుతూ పదో తరగతిలో ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని, ఆ విషయాన్ని తన తల్లి పసిగట్టి వార్నింగ్ ఇచ్చిందని అని అన్నారు. ఈ భామ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ శుక్రవారం విడుదలై మంచి టాక్ అందుకుంది. అయితే తాజాగా ఓ ఆంగ్లపత్రికతో కియారా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. జీవితంలో ఒక్కసారి ప్రేమలో పడ్డానని చెప్పారు. నేను ఒక్కసారి మాత్రమే ప్రేమలోపడ్డా. కేవలం అతడితో మాత్రమే ఎక్కువ రోజులు బంధంలో ఉన్నా. మేమిద్దరం కలిసే పెరిగాం, కాబట్టి మా మధ్య ప్రేమ చాలా విభిన్నంగా ఉండేది. ఇప్పటికీ అతడు నా స్నేహితుడే. నాకు సంతోషంగా అనిపించినా, బాధ కల్గినా అతడికే ఫోన్ చేస్తాను అని చెప్పారు .