సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నటి నమిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డ అతనికి నమిత గట్టి కౌంటర్ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. అంతేకాకుండా తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకే యత్నించిన వ్యక్తి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేశారు. సెంటమిజ్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో నాకు డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తూ. అసభ్యకరంగా పిలవడం ప్రారంభించాడు. హాయ్ ఐటమ్ అంటూ నీచంగా ప్రవర్తించాడు. దీనిపై నేను ఆగ్రహం వ్యక్తం చేయడంతో. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు.
అతని మాటలు నమ్మని నేను గట్టిగా నిలదీశాను. దీంతో అతని వద్ద నా అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. నాకు అందులో నిజమెంతో తెలుసు కాబట్టి. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాను. ఓ వ్యక్తిగా నా గురించి మీకేం తెలుసు?. నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి. ఒక నిజమైన మనిషికి స్త్రీని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరైనా తన సొంత తల్లిని అవమానపరిస్తే కలిగే బాధ అతనికి తెలుసు.
Topics: