New problems to team India ahead of T20 world cup: టీ 20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ఐపీఎల్‌లో కొందరి ఆటగాళ్ల ప్రదర్శన టీమిండియాను ఆందోళన పరుస్తోంది. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్‌లో కొందరు భారత క్రికెటర్లు విఫలమవుతుండడం అభిమానులను కూడా షాక్‌కు గురి చేస్తోంది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటతీరును సెలక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల చివరన పొట్టి ప్రపంచకప్‌నకు జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. సెలక్షన్స్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోతోంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఒత్తిడి కారణంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ 2024లో బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్లు ఇంతవరకూ అంచనాలను అందుకోలేకపోయారు. ఈ పరిణామాలు బీసీసీఐకు తలనొప్పుులు తెస్తున్నాయి. ఐపీఎల్ అంచనాలు అందుకోలేక పోయిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
రాహుల్ ఆ మెరుపులేవీ..?
గాయం నుంచి కోలుకున్న KL రాహుల్(KL RAhul).,.. ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. కానీ ఇప్పటి వరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. IPL 2024లో మొదటి మ్యాచ్‌లో 58 పరుగుల ఇన్నింగ్స్‌తో రాహుల్ టచ్‌లోకి వచ్చాడని అందరూ భావించారు. కానీ ఆ మ్యాచ్‌లో రాహుల్ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ల్లో రాహుల్ మంచి ఆరంభాన్ని అందుకున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. రాహుల్ పంజాబ్‌పై 15 పరుగులు, బెంగళూరుపై 20 పరుగులు చేశాడు. రాహుల్ చాలా వేగంగా ఆడగలడు. అవలోకగా సిక్సులు కొట్టగలడు. కానీ ఈ సీజన్‌లో రాహుల్ 3 మ్యాచ్‌ల్లో 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రపంచ కప్‌నకు ముందు రాహుల్ వరుసగా విఫలమవుతండడం… టీమిండియాను ఆందోళన పరుస్తోంది.
పనిచేయని జడేజా స్పిన్ మంత్రం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఒకడు. ఐపీఎల్ కెరీర్‌లో 2,776 పరుగులు చేయడంతో పాటు 153 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే ప్రస్తుత సీజన్‌లో జడ్డూ తన స్పిన్ మాయను.. బ్యాట్‌తో విధ్వంసాలను చూపలేకపోతున్నాడు. గత 2 మ్యాచుల్లో చెన్నైకి లోయర్ ఆర్డర్‌లో భారీ స్కోర్లు చేసే బ్యాటర్ అవసరమయ్యాడు. ఆ అవకాశాన్ని జడేజా వృథా చేశాడు. ప్రస్తుత సీజన్‌లో జడేజా ఇప్పటి వరకు 84 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. బౌలింగ్‌లో జడేజా సమస్యలు సెలెక్టర్ల ఇబ్బందులను మరింత పెంచుతోంది.
ఆశలు ఆవిరి చేస్తోన్న అర్ష్‌దీప్
అర్ష్‌దీప్ సింగ్ చాలా కాలంగా టీ20లో భారత జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. కానీ IPL 2024లో అతను 9 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇస్తున్నాడు. ఇది కాకుండా గత నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇలాగే బౌలింగ్ చేస్తే టీ20 ప్రపంచకప్ జట్టులో అర్ష్‌దీప్‌కు చోటు దక్కకపోవచ్చు.
మరిన్ని చూడండి