మిస్టర్ మజ్ను, సవ్యసాచి సినిమాల్లో గ్లామర్ తో ఆకట్టుకున్నది బాలీవుడ్ అందాల భామ నిధి అగర్వాల్. తాజాగా ఆమెకు తెలుగులో మరో చక్కటి అవకాశం ను సొంతం చేసుకుంది . హీరో రామ్‌తో రొమాన్స్ చేయనున్నది. రామ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్రబృందం సోమవారం నాడు అధికారికంగా ప్రకటించటం జరిగింది. ఇస్మార్ట్ కుటుంబంలోకి నిధికి స్వాగతం అని ట్విట్టర్ ద్వారా ఛార్మి పేర్కొన్నారు. నిధి అగర్వాల్ త్వరలో ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరో రామ్‌పై హాలీవుడ్ రేంజ్ లో పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.