Sports

PAK Vs AFG: Pakistan Scored Runs For Wickets Against Afghanistan In World Cup 2023 22nd Match | PAK Vs AFG: ఆఫ్ఘన్ల ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచిన పాక్


ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ (17: 22 బంతుల్లో, రెండు ఫోర్లు)… పాకిస్తాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 10.1 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. బలంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని అజ్మతుల్లా విడదీశాడు. ఇమామ్ ఉల్ హక్‌ను పెవిలియన్ బాట పట్టించాడు.

రెండో వికెట్‌కు బాబర్ ఆజంతో (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి మరో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అబ్దుల్లా షఫీక్. ఈ జోడి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అబ్దుల్లా షఫీక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి నూర్ అహ్మద్ పాకిస్తాన్‌కు రెండో వికెట్ అందించాడు. రాగానే సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన మహ్మద్ రిజ్వాన్ (8: 10 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ (25: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), బాబర్ ఆజం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజం అర్థ సెంచరీ కూడా పూర్తయింది. క్రీజులో కుదురుకుంటున్న దశలో సౌద్ షకీల్ అవుటయ్యాడు. కాసేపటికే బాబర్ ఆజం కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ 209 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే చివరి ఓవర్లలో షాదాబ్ ఖాన్ (40: 38 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ఇఫ్తికర్ అహ్మద్ (40: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) పాకిస్తాన్‌ను ఆదుకున్నారు. వీరు చాలా వేగంతో పరుగులు చేశారు. ఈ జోడి ఆరో వికెట్‌కు కేవలం 7.3 ఓవర్లలోనే 73 పరుగులు జోడించింది. ముఖ్యంగా ఇఫ్తికర్ అహ్మద్ సిక్సర్లతో చెలరేగాడు. షాదాబ్ ఖాన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ తనకు చక్కటి సహకారం అందించాడు. అయితే చివరి ఓవర్లో నవీన్ ఉల్ హక్ వీరిద్దరినీ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్

పాకిస్థాన్ తుదిజట్టు
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రౌఫ్



Source link

Related posts

Rishabh Pant Revealed The Shocking Facts To The Car Accident In A Special Interview

Oknews

Ips Officer Cv Anand On Sarfaraz Khans Debut

Oknews

మయాంక్ ఎక్స్ ప్రెస్ రెండు మ్యాచ్ లకు దూరం.

Oknews

Leave a Comment