Sports

Pakistan call up Mohammad Amir and Imad Wasim for New Zealand T20Is


Pakistan call up Mohammad Amir and Imad Wasim for New Zealand T20Is: న్యూజిలాండ్‌( New Zealand)తో ఈ నెల 18న ఆరంభం కానున్న అయిదు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌( Mohammad Amir ), స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌(Imad Wasim ) మళ్లీ పాక్‌ జట్టులో చేరనున్నారు. ఇప్పటికే రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు… తమ రిటైర్‌మెంట్‌ వెనక్కి తీసుకోవడంతో జట్టులోకి ఎంపిక చేశారు. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆమిర్‌, ఇమాద్‌లను పీసీబీ సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వీళ్లిద్దరూ గత నెలలో రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పేసర్‌ హారిస్‌ రవూఫ్‌కు గాయం కావడం.. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ ఫామ్‌లో లేకపోవడంతో వారి స్థానాల్లో ఆమిర్‌, ఇమాద్‌లకు పాక్‌ జట్టులో స్థానం కల్పించామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు టీమ్‌ మేనేజర్‌ వాహబ్‌ రియాజ్‌ చెప్పాడు. 2021లో ఆమిర్‌.. 2023లో ఇమాద్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. మరోవైపు న్యూజిలాండ్‌తో తలపడే పాక్‌ జట్టుకు బాబర్‌ అజామ్‌ కెప్టెన్‌(Babar Azam)గా వ్యవహరించనున్నాడు. 

ఫిటెనెస్‌ కోసమే
సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుందని భావించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు(PCB)… పాక్‌ క్రికెటర్లకు సైనికుల నేతృత్వంలో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపింది. సైనిక శిక్షణ వల్ల పాక క్రికెటర్ల ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుందని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఆటగాళ్ల సైనిక శిక్షణకు సంబంధించిన వీడియోను కూడా పాక్‌ క్రికెటర్‌ బోర్డు విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్‌నెస్‌ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Also Watch: ఏడాదిన్నరగా నితీశ్ జర్నీ చూసి మెచ్చుకోవాల్సిందే..!

ఎవరెవరు ఉన్నారంటే..?
సాహిబ్‌జాదా ఫ‌ర్హ‌న్‌, హ‌సీబుల్లా, సౌద్ ష‌కీల్‌, ఉస్మాన్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ హ‌రిస్‌, స‌ల్మాన్ అలీ ఆఘా, ఆజ‌మ్ ఖాన్‌, ఇఫ్తిక‌ర్ అహ్మాద్‌, ఇర్ఫాన్ ఖాన్ నియాజి, షాదాబ్ ఖాన్‌, ఇమాద్ వాసిమ్‌, ఉసామా మీర్‌, మ‌హ‌మ్మ‌ద్ న‌వాజ్‌, మెహ్ర‌న్ ముంతాజ్‌, బ్రార్ అహ్మ‌ద్‌, ష‌హీన్ షా అఫ్రిది, న‌సీమ్ షా, మ‌హ‌మ్మ‌ద్ అబ్బాస్ అఫ్రిది, హ‌స‌న్ అలీ, మొహ‌మ్మ‌ద్ అలీ, జ‌మాన్ ఖాన్‌, మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం జూనియ‌ర్, ఆమిర్ జ‌మాల్‌, హ‌రీస్ రౌఫ్‌, మ‌హ‌మ్మ‌ద్ ఆమిర్ ఉన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీ20 ప్రపంచ కప్‌ సమీపిస్తున్న తరుణంలో.. షహీన్‌ అఫ్రిదిని తప్పించి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి బాబర్‌ అజామ్‌కు అప్పగించారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Also Read: తెలుగోడా మజాకా, ఎవరీ నితీశ్‌కుమార్ రెడ్డి 

ట్రోల్స్‌ మాములుగా లేవు
పాక్‌ క్రికెటర్లకు సైనిక శిక్షణ ఇప్పిస్తుండడంపై  సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మాములుగా ఉండడం లేదు. ఇది ఆటనుకున్నారా.. యుద్ధం అనుకున్నారా అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో ఇదంతా చూడటానికి ఫన్నీగా ఉందని పోస్ట్‌లు చేస్తున్నారు. మ్యాచ్‌ ఆడుతున్నారా.. లేక అమెరికాపై దాడి చేస్తారా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

SRH vs MI Match Highlights IPL 2024 | SRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya

Oknews

Belgium born Antum Naqvi receives maiden Zimbabwe call up for India T20Is

Oknews

Rishabh Pant Makes Cricket Comeback In Alur Set To Lead Delhi Capitals In IPL 2024

Oknews

Leave a Comment