పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉన్న హీరో. దాదాపు ఇరవై ఐదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవా చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినప్పటికీ. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశాడు. ఈ కారణంగానే పవన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా అతడు రిస్క్ చేస్తుండడం షాక్‌కు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా రిస్క్.
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన పవన్ కల్యాణ్.. ‘వకీల్ సాబ్’తో పాటు మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం కాగా, మరొకటి హరీశ్ శంకర్ రూపొందించబోయే మూవీ. ఒక సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం ఈ మూవీలో ఉండే రెండు పాత్రల్లో ఒకదాని కోసం లావుగా, మరో దాని కోసం సన్నగా కనిపించాలట. ఇప్పుడు షూటింగ్‌కు విరామం దొరకడంతో సన్నబడడం కోసం ఇంట్లోనే దాదాపు ఐదారు గంటల పాటు చెమటోడ్చుతున్నాడని సమాచారం.అదే సమయంలో ఈ సినిమా కోసం కత్తిసాము, గుర్రపు స్వారీలో సైతం పవన్ కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి కొందరిని పిలిపించుకున్న ఆయన
Topics: