GossipsLatest News

Pawan Kalyan to Verma house వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్



Sat 30th Mar 2024 06:10 PM

pawan kalyan  వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్


Pawan Kalyan to Verma house వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్

పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని చంద్రబాబు జనసేనకు కేటాయించడంపై పిఠాపురం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ వర్మ అనుచరులు నానా రచ్చ చేసారు. వర్మ కూడా టీడీపీ అధ్యక్షునిపై అలిగాడు. చంద్రబాబు బుజ్జగింపులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను బరి నుంచి తప్పుకుంటానంటూ వర్మ చంద్రబాబుకి మాటిచ్చాడు. వర్మ చంద్రబాబు-పవన్ కళ్యాణ్ తో కలిసి కూర్చుని మాట్లాడి సమస్యని పరిష్కరించుకున్నాడు. 

ఆ తర్వాత పవన్ పిఠాపురంలో పోటీ చెయ్యకపోతే అప్పుడు నేను మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను కానీ ఆ సీటు మరొకరికి ఇవ్వనివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు. ఫైనల్ గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ అనివార్యమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. 

పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ వర్మ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కి గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష జనం ఘన స్వాగతం పలికారు. జనసేన, టిడిపి శ్రేణులతో  పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వర్మ గారి కుటుంబ సభ్యులు పవన్ ని సత్కరించారు. 

పవన్ కళ్యాణ్ వర్మ తల్లిగారు శ్రీమతి అలివేలు మంగ పద్మావతి గారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ ని, సుజయ్ కృష్ణ రంగారావునీపవన్ కళ్యాణ్ గారు సత్కరించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. 


Pawan Kalyan to Verma house:

Pawan Kalyan To TDP Varma House









Source link

Related posts

Shruti Haasan in Velunachiyar Biopic నయన్, అనుష్క.. ఇప్పుడు శృతి

Oknews

ఇది సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారా.. విశాల్‌పై హైకోర్టు అక్షింతలు! 

Oknews

పరభాషా నటులు సైతం అసూయపడే కీర్తి ప్రభాస్ సొంతం

Oknews

Leave a Comment