సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సంక్రాంతికి ‘పేట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో జనవరి 10న విడుదల కాబోతోంది.
ప్రమోషన్లో భాగంగా తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. డిఫరెంట్ స్టైల్, మేనరిజమ్స్ ప్రదర్శిస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేసే రజనీకాంత్ ‘పేట’లో మరోసారి ఫ్యాన్స్ కోరుకున్న విధంగా మాస్ మసాలా వినోదం పంచనున్నట్లు తెలుస్తోంది.