ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్…ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు అరెస్ట్ కావటంతో… ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ప్రణీత్ రావు అరెస్ట్ తో మొదలైన ఈ వ్యవహారంలో ఇటీవలే ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతస్థాయి అధికారితో పాటు మరికొందరికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలోకి ఉంది. ఈ సమయంలో… ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొందరి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరేకాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసి… డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురు పోలీసు అధికారులను అరెస్టు అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అదనపు ఎస్పీలు ఉన్నారు. మొదటగా ఎస్ఐబీ డీఎస్సీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు.
Source link