Telangana

PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారు



ప్రధానమంత్రి 4వ తేదీన ఆదిలాబాద్‌, మార్చి 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రెండు చోట్ల బహిరంగ సభల్లో కూడా ప్రసంగిస్తారని ఆమె తెలిపారు. అందుకు అనుగుణంగా బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, బందోబస్త్‌ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రధాన కార్యదర్శి సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతో పాటు అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశించారు. అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ప్రధానమంత్రి కాన్వాయ్‌ పర్యటించే మార్గాలలో రోడ్లు పరిశీలించాలని ఏ వైన మరమ్మత్తులు ఉంటే యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని పోలీసు, GHMC, రోడ్లూ భవణాల శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా చూడాలని సూచించారు.



Source link

Related posts

Hyderabad regional ring road is super game changer says Minister Komati Reddy Venkat Reddy

Oknews

cm revanth reddy key orders on hyderabad greater city corporation | Greater City Corporation: గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

Oknews

రూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు.. గిన్నీస్ రికార్డు సాధిస్తానంటున్న యువకుడు

Oknews

Leave a Comment