ByGanesh
Sun 11th Feb 2024 11:06 AM
పూజ హెగ్డే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఖాళీగానే కనిపిస్తుంది. గుంటూరు కారం వద్దనుకుందో, లేదంటే ఆమెని తప్పించారో కానీ పూజ హెగ్డే లక్కీగా ఆ సినిమా నుంచి సేవ్ అయినట్లే. గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల కేరెక్టర్ ని మరీ చీప్ గా చూపించారు. శ్రీలీల మహేష్ ని పడెయ్యడానికి, అతనితో సంతకం చేయించడానికి రకరకాలుగా వాడేశారు. అసలు ఆ కేరెక్టర్ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడమే ఆమె లక్కీగా సేఫ్ అయ్యింది అనే మాట ఆ చిత్రంలో శ్రీలీల కేరెక్టర్ చూసిన దగ్గర నుంచి ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గత రెండేళ్లుగా వరస ప్లాప్ లతో సతమతమవుతున్న పూజ హెగ్డే సోషల్ మీడియాలో కూడా డల్ గానే కనిపిస్తుంది.
కానీ తాజాగా ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ లో సాంప్రదాయంగా, గ్లామర్ ఫొటోస్ వదులుతూ తనవైపు చూడమని దర్శకనిర్మాతలకి సంకేతాలిస్తుంది. తరచూ ఇన్స్టా లో ఫొటోస్ షేర్ చేస్తుంది. క్యూట్ గా బ్యూటిఫుల్ గా కవ్విస్తూ కనిపిస్తుంది. మరి ఆమె ప్లాప్ లు చూసి సడన్ గా పూజ హెగ్డే ని సౌత్ పక్కనబెట్టేసింది. హరీష్ శంకర్ లాంటి దర్శకులు మళ్ళీ పూజ హెగ్డే కి ఓ ఛాన్స్ ఇస్తే పూజ హెగ్డే మళ్ళీ యాక్టీవ్ అవుతుంది. అన్నట్టు పూజ హెగ్డే సౌత్ అందులోను తమిళనాట ఓ ఆఫర్ వచ్చింది అనే న్యూస్ ఉంది. అది ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది.
Pooaj Hegde new insta look viral:
Pooaj Hegde latest social media look viral