ByGanesh
Mon 19th Feb 2024 10:08 AM
బుట్ట బొమ్మ గా టాలీవుడ్ స్టార్ హీరోలని చుట్టేసి టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తుంది అనుకున్న సమయంలో పూజ హెగ్డే కి రష్మిక రూపంలో హెవీ కాంపిటీషన్ మొదలైంది. కొన్నాళ్ళు పూజ హెగ్డే-రష్మిక నువ్వా – నేనా అని అవకాశాల్లో పోటీపడ్డారు. కానీ పూజ హెగ్డే ని వరస ప్లాప్ లు ఒక మెట్టు దిగేలా చెయ్యడం కాదు.. ఆమె అవకాశాలు కోల్పోవడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఆమె నటించిన ఏ లాంగ్వేజ్ లోను ఆమెకి సక్సెస్ రాకపోయేసరికి ఆమెని దర్శకనిర్మాతలు దూరం పెట్టేస్తున్నారు.
దానితో సోషల్ మీడియాలోనూ ఆమె ఫోటో షూట్స్ తగ్గాయి. ఒకప్పుడు సినిమా షూటింగ్స్ లో బిజీగా వున్నా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న పూజ హెగ్డే ఈమధ్యన చాలా అరుదుగా తన ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా ట్రెడిషనల్ గా సారీ లుక్ ని పూజ హెగ్దే షేర్ చేసింది. ఎల్లో కలర్ పట్టు సారీ లో పూజ హెగ్డే నిజంగా బుట్టబొమ్మలా అందరి వంతులు పోగొట్టేసింది. గ్రీన్ కలర్ డైమండ్ జ్యువలరీతో పూజ హెగ్డే అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. పూజ హెగ్డే బ్యూటిఫుల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pooja Hegde in Yellow Saree:
Pooja Hegde aces her traditional look in a yellow saree