Entertainment

Popular Actress Passes Away – Telugu Shortheadlines


ప్రముఖ హీరోయిన్ హఠాన్మరణం.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి విద్యా సిన్హా(71) ముంబై జుహూ హాస్పిటల్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఈమె గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. `రజనీగంధ`, `చోటీ సీ బాత్`, `పతి పత్నీ ఔర్ వో` తదితర చిత్రాల్లో నటించారు. నవంబర్ 15, 1947లో జన్మించారు. మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాతే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. `రాజాకాక` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. `రజనీగంధ` చిత్రం సాధించిన భారీ విజయంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 1986లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. 2011లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన `బాడీగార్డ్` చిత్రమే ఈమె చివరి చిత్రం. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా ఈమె తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

Topics:

 



Source link

Related posts

శంకర్‌కు భారీ షాక్‌.. ప్లేట్‌ ఫిరాయించిన నెట్‌ఫ్లిక్స్‌!

Oknews

How to follow Twitter handles and searches in Feedly – Feedly Blog

Oknews

మెగా వార్.. అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్!

Oknews

Leave a Comment