Entertainment

Prabhas Birthday facts About birthday Boy Darling Prabhas


#HappyBirthdayPrabhas: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్, రాధే శ్యామ్ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్ 

తెలుగు సినిమా రెబల్ స్టార్ ప్రభాస్‌ నేడు 42వ పుట్టిన రోజు (Happy birthday Prabhas) జరుపుకుంటున్నారు.  డార్లింగ్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆయన పుట్టిన రోజు కానుకగా ఈ రోజు ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌ నుంచి బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్ (Beats Of Radhe Shyam)‌ విడుదల అయింది. ఇక ప్రభాస్ వ్యక్తిగత జీవితంలోకి వెళితే.. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు. తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, తల్లి పేరు శివ కుమారి. ఇంట్లో అందరికంటే చిన్నవాడు. తనకు అన్నయ్య ప్రబోధ్‌, అక్క ప్రగతి ఉన్నారు. భీమవరంలోని డీఎన్‌ఆర్‌ స్కూల్లో ప్రభాస్ చదువుకున్నారు.ప్రభాస్‌ ఇంజనీర్‌ గ్రాడ్యూయేట్‌( శ్రీ చైతన్య ఇంజరీంగ్‌ కళశాల) చేయడానికి ముందుగా తను హోటల్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నా.. అది కార్యరూపం దాల్చకపోవడంతో హీరోగా మారారు.

కేవలం బాహుబలి సినిమా కోసం నాలుగేళ్లు ఏ సినిమాను ఒప్పుకోలేదు.ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా తన ఇంట్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు. ఏకంగా ముఫ్పై కిలోల బరువు పెరిగాడు.  బాహుబలి కోసం జిమ్ లో మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకున్నాడు. ప్రభాస్‌కు ఇష్టమైన నటుడు రాబర్ట్ డి నిరో అని ఆయన చెబుతుంటారు. 

రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఇటలీలో కొనసాగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్‌లో రివీల్ చేసారు. రాధే శ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు ఈయన సంగీతం అందించాడు. ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది.

మరోవైపు ప్రభాస్ బర్త్ డే (#HappyBirthdayPrabhas) సందర్భంగా స్పెషల్‌గా ప్రభాస్ నటించిన వివిధ సినిమాల్లోని క్లిప్లింగులతో కలిపి రైస్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను డైరెక్టర్ మారుతి, బివియస్ రవితో పాటు మరికొందరు మీడియా ప్రముఖులు కలిసి ఈ వీడియో తయారు చేయడంలో భాగం పంచుకున్నారు.
 

 



Source link

Related posts

మెగాస్టార్ విశ్వంభర విలన్ మన తెలుగువాడే..ఇక పూనకాలు లోడింగ్ 

Oknews

Mohanlal -Sanjay Dutt Ring in the Festival of Lights Together

Oknews

మెగా మల్టీస్టారర్.. ఒకే సినిమాలో చిరు, పవన్, చరణ్!

Oknews

Leave a Comment