ByGanesh
Wed 26th Jun 2024 01:39 PM
ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD కోసం ఎదురు చూస్తుంది. మరికొన్ని గంటలే సమయముంది.. కల్కి ఆడియన్స్ ముందుకు రావడానికి. ప్రభాస్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకుల సైతం కల్కి మ్యానియాతో మునిగితేలుస్తున్నారు
మొత్తం అంతటా కల్కి 2898 AD రచ్చ జరుగుతుంటే మధ్యలో ప్రభాస్ మరో చిత్రం రాజా సాబ్ ముచ్చట కనిపించింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడల్లా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు మారుతి. అందరూ కల్కి కబుర్లలో మునిగి తేలుతుంటే మారుతి అలాగే రాజా సాబ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు చెన్నై సాగర తీరంలో రాజా సాబ్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నారట.
రాజాసాబ్ లో మొత్తం 5 పాటలు ఉండబోతున్నాయని అందులో ఇప్పటికే 3 పాటలకు తమ ట్యూన్లు రెడీ చేసి ఇచ్చేశాడు. ఇంకా రెండు పాటలు బాకీ. ఆ రెండు పాటలను రాబట్టుకునే విషయంలో మారుతి, థమన్ లు చెన్నై మెరీనా బీచ్ కి వెళ్లారు. మరి ఈఏడాది ఎలా ఉన్నా 2025 సంక్రాంతికి రాజాసాబ్ ని విడుదల చెయ్యాలని మారుతి ఉన్నట్లుగా తెలుస్తోంది.
Prabhas Raja Saab update:
Interesting update on Raja Saab movie