ByGanesh
Fri 01st Mar 2024 08:46 PM
బాలీవుడ్ లో హీరోయిన్ గా నిరూపించుకున్నాకే సౌత్ కి ఎంట్రీ ఇద్దామనుకున్న జాన్వీ కపూర్ కి హిందీ సినిమాలు వరసగా షాకిస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు జాన్వీ కపూర్ చూపు సౌత్ మీద పడింది. సౌత్ లో అవకాశం రావడమే ఆలోచించకుండా ఒప్పేసుకుంది. అందులోను ప్యాన్ ఇండియా స్టార్స్ ఛాన్సెస్ అంటే ఎందుకు ఒప్పుకోదు. ఎన్టీఆర్ తో దేవర మూవీ చేస్తున్న సమయంలోనే రామ్ చరణ్ మూవీ ఆఫర్ రాగానే జాన్వీ కపూర్ చటుక్కున ఒప్పేసుకుంది. ఆపై సూర్య తో భారీ చిత్రమైన కర్ణ కి సైన్ చేసే ఆలోచనలో ఉంది.
మరి స్టార్ హీరో ల సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా మారిన జాన్వీ కపూర్ కి ఐటెం సాంగ్ చేసే అవకాశం వస్తే ఒప్పుకుంటుందా అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ కి సౌత్ లో పెరుగుతున్న అవకాశాలతో మంచి క్రేజ్ రావడంతో దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప 2 లో ఓ క్రేజీ స్పెషల్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ ని సంప్రదించారని న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. సమంత తో అల్లు అర్జున్ చేసిన ఊ అంటావా ఉహూ అంటావా సాంగ్ ని మించి పుష్ప 2 ఐటెం సాంగ్ ఉంటుంది అంటున్నారు.
మరి సమంత కి ఆ ఆట, పాటతో ఎంత పేరొచ్చిందో అందరూ చూసారు. మరి జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్, ఇప్పుడు జాన్వీ కపూర్ ని ఐటెం సాంగ్ కోసం సంప్రదిస్తే మాత్రం ఆమె ఒప్పుకుంటుందా.. అందులోను ఆమె కెరీర్ ని మలుస్తున్న ఆమె తండ్రి బోని కపూర్ అల్లు అర్జున్ తో ఆడిపాడేందుకు సమ్మతినిస్తారా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న అనుమానం. ఇక పుష్ప 2 ఐటెం సాంగ్ విషయంలో చాలామంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇప్పుడు జాన్వీ వచ్చి చేరింది.
Pushpa 2 – Janhvi Kapoor approached for a special song:
Janhvi Kapoor for Pushpa 2 special song