నిన్న ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే రోజున విడుదలైన పుష్ప ద రూల్ టీజర్ పై టాలీవుడ్ హీరోల దగ్గర నుంచి కన్నడ హీరోలు వరకు కామెంట్ చేసారు. అభిమానులకే కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా పుష్ప 2 మాస్ జాతర బాగా నచ్చింది అన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 ఫస్ట్ లుక్ లోనే అమ్మవారి గెటప్ లో అందరిని ఇంప్రెస్స్ చేసాడు. అదే లుక్ తొ గంగమ్మ జాతర ని హైలెట్ చేస్తూ సుకుమార్ మరోసారి అల్లు అర్జున్ బర్త్ డే రోజున టీజర్ కట్ చేసారు.
పుష్ప 2 టీజర్ స్టార్ట్ అవడమే అల్లు అర్జున్ పవర్ ఫుల్ అమ్మవారి లుక్ లో దర్శనమిచ్చాడు. చీర కట్టుకొని, మెడలో నిమ్మకాయల దండ, పూల మాల వేసుకొని, కాళ్లకి గజ్జెలు, చెవులకు దుద్దులు పెట్టుకుని, ముక్కుకి ముక్కెర, కళ్లకి కాటుక పెట్టుకొని, ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో త్రిశూలం పట్టుకొని అమ్మవారి విశ్వరూపం చూపించాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పవర్ ఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. అంతేకాదు అల్లు అర్జున్ చీరని అలవోకగా కాలితో చేతికి తీసుకొని, నడుమున దోపే షాట్,రౌడీలను చితక్కొడుతూ నడుస్తూ వెళ్లే షాట్ అన్ని టీజర్ లో హైలెట్ అయ్యాయి.
అయితే అన్ని బావున్నాయి. కానీ టీజర్ లో ఒకటే మిస్ అయ్యింది అంటూ చాలామంది కాదు కాదు అభిమానులు ఈరోజు మాట్లాడుతున్నారు. అది పుష్ప 2 టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడంపై అందరూ పెదవి విరుస్తున్నారు. అదిరిపోయే కలర్ ఫుల్ సెట్, పూనకాలు తెప్పించే BGM అన్ని వున్నా ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ పడకపోవడం డిస్సపాయింట్ చేసిందని అంటున్నారు. ఒకే ఒక్క డైలాగ్ పడుంటే అసలైన మాస్ జాతర మొదలయ్యేదని కామెంట్ చేస్తున్నారు. మరి పుష్ప 2 టీజర్ లో ఆ ఒక్కటి తక్కువ కాకపోతే వేరే లెవల్ అన్న రేంజ్ లో ఉండేది అంటూ అల్లు అభిమానులే గుసగుసలాడుతున్నారు.