Sports

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November


Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీంకు కోచ్ గా తన పేరు ఉండటానికి ప్రధాన కారణం రోహిత్ శర్మేనని రాహుల్ ద్రావిడ్ అన్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు..!రాహుల్ ద్రావిడ్ అసలు ఇలా ఎందుకన్నారంటే..! 2023లో వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సొంతగడ్డపై చివరి అడుగులో కప్ కోల్పోవడంపై రాహుల్ ద్రావిడ్ చాలా బాధపడ్డారట. ఇక కోచింగ్ చాలు అనుకుని…తన కోచ్ పదవికి రాజీనామా కూడా చేయాలని డిసైడ్ అయ్యారట. ఎందుకంటే… ఒక ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు కూడా ఐసీసీ ట్రోఫీని అందుకోలేదు. దీంతో.. కోచ్ గా ఐనా ఆ కల నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇండియా A టీమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ నమ్మకంతో… ఈయన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడం కాదు.. కోచ్ పదవే ఈయనను వరించింది. కోచ్ గా అనిల్ కుంబ్లే, రవిశాస్త్రీ టైం పీరియడ్ లో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో..వాటన్నింటిని అధిగమిస్తూ టీం ఇండియాను మునుపటిలా స్ట్రాంగ్ గా నిలబెట్టే సత్తా రాహుల్ కు ఉందని బీసీసీఐ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో..వరల్డ్ కప్ ఓడిపోయిన తరువాత ఇంతటి నమ్మకాన్ని వమ్ము చేశాననే బాధలో రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. కానీ, ఆ సమయంలో రోహిత్ శర్మ అండగా నిలబడ్డాడని ద్రావిడ్ అన్నారు. మ్యాచ్ లు విజయాలు, అపజయాలు కామన్ కానీ, మీ సేవలు టీ20 వరల్డ్ కప్ వరకు అవసరం. కనీసం అప్పటి వరకైనా కొనసాగండి అంటూ రోహిత్ ఫోన్ చేసి చెప్పడంతో రాహుల్ ద్రావిడ్ మనసు మార్చుకున్నారు. ఓ కెప్టెన్, కోచ్ మధ్య బేధాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ.. రోహిత్ తో పర్సనల్ బాండింగ్ వేరే లెవల్ అన్నట్లుగా ద్రావిడ్ చెప్పుకోచ్చారు. రోహిత్, రాహుల్ కు అంత మంచి బాండింగ్ ఉన్నందుకే… కొన్నాళ్లుగా గ్రౌండ్ లో ఐనా, డ్రెస్సింగ్ రూంలో ఐనా అద్భుతమైన వాతావరణం ఏర్పడింది.

క్రికెట్ వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?

మరిన్ని చూడండి



Source link

Related posts

Pakistan call up Mohammad Amir and Imad Wasim for New Zealand T20Is

Oknews

Norman Pritchard the first athlete to represent India at Olympics and win two medal

Oknews

Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh

Oknews

Leave a Comment