Latest NewsTelangana

railway officials announced secunderabad and vizag vande bharat train cancelled on 8th march due to technical reason | Vande Bharat: ప్రయాణికులకు అలర్ట్ – సికింద్రాబాద్


Secunderabad and Visakha VandeBharat Train Cancelled: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్. సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలును శుక్రవారం రద్దు చేసినట్లు ప్రకటించింది. సాంకేతిక లోపం కారణంగా రైలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి ఛార్జీ రిఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే, దీనికి ప్రత్యామ్నాయంగా 08134A నెంబరుతో మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వందేభారత్ షెడ్యుల్ ప్రకారమే ఈ రైలూ సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి.. రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుతుందనిపేర్కొన్నారు. వందేభారత్ రైలు మాదిరిగానే ఆయా స్టాపుల్లో రైలు నిలుస్తుందని వెల్లడించారు. ఆసక్తి గల ప్రయాణికులు ఈ రైలులో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మం స్టేషన్ లో ఒక్క నిమిషం, రాజమండ్రి, సామర్లకోటల్లో 2 నిమిషాలు, విజయవాడ స్టేషన్ లో 5 నిమిషాలు ఆగుతుంది. 

Also Read: VijayaSai Reddy ‘ప్యాకేజీ పొత్తు, 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది’ – సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటెయ్యాలని విజయసాయి పిలుపు

మరిన్ని చూడండి



Source link

Related posts

Kalki Ticket rates hiked కల్కి రేట్లు అక్కడ కూడా పెరిగాయ్

Oknews

Narayankhed Municipality: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీని దక్కించుకున్న కాంగ్రెస్

Oknews

Telangana TDP left leaderless టీడీపీకి పెద్ద నష్టమే..

Oknews

Leave a Comment