ByGanesh
Thu 21st Mar 2024 05:56 PM
టాలీవుడ్ టాప్ పొజిషన్ నుంచి జారిపోయి హిందీ లో పాతుకుపోదామని కలలు కన్న రకుల్ కి అక్కడ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వరస ప్రాజెక్ట్స్ చేసింది కానీ.. బాలీవుడ్ లో రకుల్ కోరుకున్న పొజిషన్ ని చేరుకోలేకపోయింది. ఇక బాలీవుడ్ వెళ్ళాక బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో చెట్టాపట్టాలేసుకుని రీసెంట్ గానే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. మరి పెళ్ళయితే అమ్మాయిల వేషధారణ మారిపోతుంది. పుట్టింటి నుంచి అత్తింటి కి వెళ్ళాక అక్కడి పద్ధతులు కి మారాల్సిందే. కానీ రకుల్ ప్రీత్ మాత్రం పెళ్లి తర్వాత ఏమి మారలేదు అంటుంది.
పెళ్ళికి ముందు పుట్టింట్లో, పెళ్లి తర్వాత అత్తింట్లో తనకి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది.. అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకి సమాధానమిచ్చింది. రకుల్ మీకు పెళ్లయ్యాక వేషధారణ విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా అనే ప్రశ్నకి రకుల్ ఇలా సమాధానమిచ్చింది. నన్ను మారమని ఎవరూ చెప్పలేదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండమని పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. పెళ్లి అనేది మన సమాజంలో పెద్ద విషయంగా చూస్తారు. పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే సహజ ప్రక్రియ అని భావిస్తే బావుంటుంది.
పెళ్లి తర్వాత ధగధగా మెరిసే షేర్వాణీలే ధరించమని అబ్బాయిలకి చెప్పగలరా.. చెప్పరు కదా, మరి ఆడవాళ్ళ విషయంలోనే ఎందుకిన్ని రూల్స్, కాలం మారిపోయింది, ఎవరికి నచ్చినట్లు వారుంటారు. ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకుంటారు. తన లైఫ్ లో పెళ్లి తర్వాత ఏమి మారలేదు అని సెలవిచ్చింది రకుల్ ప్రీత్.
Rakul on change in dressing post marriage:
Rakul Preet Singh Opens Up About Fashion Choices Post Marriage