ByGanesh
Mon 05th Feb 2024 07:55 PM
రామ్ చరణ్ తన భార్య ఉపాసన, పాప క్లింకార తో కలిసి తిరుమల తిరుపతికి వెళుతున్నారు. తన కూతురు పుట్టాక మొదటిసారిగా రామ్ చరణ్ భార్య కుమార్తెతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. రామ్ చరణ్-ఉపాసనలకు జూన్ 20 న క్లింకార జన్మించింది. ఆ తర్వాత తమ పాప తో వెకేషన్స్ కి వెళ్లిన చరణ్ ఇప్పుడు ప్రత్యేకంగా తిరుపతికి వెళ్ళటానికి కారణం.. క్లింకార కి పుట్టెంటుకలు(తలనీలాలు) తీయించడానికి అని తెలుస్తోంది.
పదకొండేళ్ల తర్వాత తమ మధ్యకు వచ్చిన కుమార్తె క్లింకారని ఉపాసన-చరణ్ దంపతులు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. పాప మొహాన్ని రివీల్ చెయ్యకుండా అందరిని సస్పెన్స్ లో ఉంచిన చరణ్ దంపతులు క్లింకారకి సంబందించిన ఏ కార్యక్రమమైనా ఎంతో ప్రత్యేకంగా జరిపిస్తున్నారు. మరి ఈ తల నీలాల కార్యకమానికి మెగాస్టార్ దంపతులు వెళ్తున్నారో.. లేదంటే కేవలం రామ్ చరణ్ దంపతులు మాత్రమే వెళతారా అనే విషయంలో మెగా ఫాన్స్ లో ఉత్సుకత కనబడుతుంది.
Ram Charan on the way to Tirupati :
Ram Charan on the way to Tirupati for Klin Kaara