ByGanesh
Wed 27th Mar 2024 10:50 AM
రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కుమార్తె క్లింకార తో సహా నేడు బుధవారం ఉదయం VIP బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఉపాసన తండ్రి కూడా చరణ్ దంపతులతో పాటుగా శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. క్లింకారని మీడియా కంట కనిపించకుండా ఉపాసన తగిన జాగ్రత్తలు తెలుసుకున్నప్పటికీ క్లింకార పాప మొహాన్ని మీడియా ఒకానొక సందర్భంలో క్లిక్ మనిపించింది. ఇక శ్రీవారి దర్శనానంతరం రామ్ చరణ్ దంపతులకి పురోహితులు తీర్ధ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు శ్రీవారి సేవలో పాల్గొని మాఢవీధుల్లో నడిచొస్తున్న క్లిప్పింగ్స్ వైరల్ గా మారాయి. బయట క్లింకార మొహం కనిపించకుండా ఉపాసన తన చీర కొంగులో చుట్టుకున్నారు. రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు సాంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారిని దర్శించుకోవడంతో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నేడు రామ్ చరణ్ బర్త్ డే. పుట్టిన రోజు రోజు సందర్భంగా రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా శ్రీవారి పూజల్లో పాల్గొన్నారు.
Ram Charan visits Tirupati temple with wife Upasana :
Ram Charan visits Tirupati temple with wife Upasana on his birthda