Latest NewsTelangana

Ramagundam Fertilizers and Chemicals Limited has released notification for the recruitment of Engineer Senior Chemist Accounts Officer Medical Officer Posts


RFCL Recruitment Notification: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) తెలంగాణ రామగుండం ప్లాంట్‌, నోయిడా కార్పొరేట్‌ ఆఫీస్‌‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్‌కాపీలను సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారిక నెలకు రూ.40,000 – రూ.1,40,000 (రూ.12.99 లక్షల సీటీసీ) వేతనం ఉంటుంది.

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 27.

➥ ఇంజినీర్ (ఇ-1): 19 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్-11, మెకానికల్-05, ఎలక్ట్రికల్-02, ఇన్‌స్ట్రుమెంటేషన్-01.

అర్హత: సంబంధి విభాగాల్లో బీఈ, బీటెక్‌, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.

➥ సీనియర్ కెమిస్ట్: 02 పోస్టులు

విభాగం: కెమికల్ ల్యాబ్.

అర్హత: ఎంఎస్సీ (కెమిస్ట్రీ).

వయోపరిమితి: 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.

➥ అకౌంట్స్ ఆఫీసర్ (ఇ-1): 05 పోస్టులు

విభాగం: ఫైనాన్ష్ & అకౌంట్స్.

అర్హత: సీఏ/సీఎంఏ/ఎంబీఏ (ఫైనాన్స్).

వయోపరిమితి: 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.

➥ మెడికల్ ఆఫీసర్ (ఇ-1): 01 పోస్టు

విభాగం: మెడికల్.

అర్హత: ఎంబీబీఎస్.

వయోపరిమితి: 31.03.2024 నాటికి 305సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత హార్డ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నామో దాని పేరు దరఖాస్తు పంపే కవరు మీద రాయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: నెలకు రూ.40,000 – రూ.1,40,000 (రూ.12.99 లక్షల సీటీసీ) ఉంటుంది.

దరఖాస్తు హార్డ్‌కాపీల పంపాల్సిన చిరునామా:
Deputy General Manager (HR)-I/c,
Ramagundam Fertilizers and Chemicals Limited,
Corporate Office,
4th Floor, Wing – A, Kribhco Bhawan, Sector-1,
Noida, Uttar Pradesh – 201301.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024.

* దరఖాస్తు హార్డ్ కాపీని పోస్టులో పంపేందుకు చివరితేదీ: 07.04.2024.

Notifiation

Online Application

Website

ALSO READ:

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్ల పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారంచుట్టింది. దీనిద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) విభాగాల్లో మొత్తం 4,660 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో సబ్-‌ఇన్‌స్పెక్టర్(RPF SI) – 452 పోస్టులు, కానిస్టేబుల్ (RPF Constable) – 4208 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను రైల్వేశాఖ(RRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Related posts

ACB Raids In HMDA Town Planning Director Shivabalakrishna House, 100 Crores Assets Identified

Oknews

Family Star pre release business details ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్

Oknews

Kalki 2898 AD Postponed AP ఎలక్షన్స్ ఎఫెక్ట్: మారబోతున్న ప్రభాస్ కల్కి డేట్

Oknews

Leave a Comment