కుప్పకూలిన వేదిక….గురువారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇందుకు అమెరికాలో ఉంటున్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సంజయ్ షా హాజరయ్యారు. ఆయనే కాకుండా కంపెనీకి చెందిన పలువురు ముఖ్యులు ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా… కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సెట్ పైకి క్రేన్ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్లు తెగిపోయాయి. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సీఈవో సంజయ్ షా తీవ్రంగా గాయపడగా.. ఆయన్ను మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఇక ఈ ప్రమాదంలో కంపెనీ ఛైర్మన్ విశ్వనాథ్ రాజ్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Source link
previous post