Ratha Sapthami at Tirumala 2024: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవమని, ఒకరోజు బ్రహ్మోత్సవమని కూడా పిలుస్తారు. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద, మాడ వీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబారన్న, పెరుగన్నం, పులిహోర, పొంగళి తదితర అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.