Latest NewsTelangana

rbi releases faq on paytm payments bank crisis know all your question and answers here


FAQs On Paytm Payments Bank Accounts: ఖాతాదార్ల నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, కొత్త క్రెడిట్‌ ఇవ్వకుండా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL) మీద రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) విధించిన ఆంక్షల తుది తేదీ అత్యంత సమీపంలోనే ఉంది. 2024 మార్చి 15 వరకే కేంద్ర బ్యాంక్‌ గడువు ఇచ్చింది. ఇది కూడా, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని PPBLకు సమయం ఇచ్చింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ తీసుకున్న చర్యలకు సంబంధించి, ఈ నెల 15 తర్వాత ఏం జరుగుతుందన్న విషయంలో, ఖాతాదార్ల నుంచి చాలా ప్రశ్నలు వినిపించాయి. ఖాతాదార్లలో ఉన్న సందేహాలు & వాటికి సమాధానాలపై రిజర్వ్ బ్యాంక్ గతంలోనే FAQs (Frequently Asked Questions) విడుదల చేసింది. 

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన RBI విడుదల చేసిన FAQs:

ప్రశ్న – నాకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్, కరెంట్ ఖాతా ఉంది. మార్చి 15 తర్వాత ‍‌(మార్చి 16 నుంచి) నేను డబ్బు విత్‌డ్రా చేయగలనా? బ్యాంకు నుంచి వచ్చిన డెబిట్ కార్డు ఏమవుతుంది?

సమాధానం: మార్చి 15 తర్వాత కూడా మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్‌ను ఉపయోగించవచ్చు. ఖాతా ఖాళీ అయ్యే వరకు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
 
ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ అకౌంట్‌కి డబ్బు డిపాజిట్ చేయవచ్చా లేదా బదిలీ చేయవచ్చా?

సమాధానం – మార్చి 15 తర్వాత డబ్బును డిపాజిట్ చేయలేరు.

ప్రశ్న – నా రిఫండ్ మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. ఇది ఆ ఖాతాలో జమ అవుతుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా రిఫండ్, క్యాష్‌బ్యాక్, వడ్డీ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఇతరుల నుంచి మాత్రం నగదును పొందలేరు. 

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ వస్తుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత ఎలాంటి సబ్సిడీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి రాదు. అసౌకర్యం పడకుండా ఉండాలంటే మరొక ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – స్వీప్ ఇన్/అవుట్ కింద భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు ఏమవుతుంది?

సమాధానం: స్వీప్ ఇన్ సౌకర్యం మార్చి 15 వరకు కొనసాగుతుంది. మార్చి 15 తర్వాత డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు.

ప్రశ్న – నా జీతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. అదే ఖాతాలో జీతం వస్తుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత మీ జీతాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయలేరు. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే తక్షణం మరొక ఖాతాకు మారాలి.

ప్రశ్న – నా కరెంటు బిల్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్‌ అవుతుంది. మార్చి 15 తర్వాత పరిస్థితి ఏంటి?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు జరుగుతుంది. ఖాతా ఖాళీ అయ్యాక ఇబ్బంది పడకుండా ఉండాలంటే వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – నా OTT సభ్యత్వం నెలవారీ చెల్లింపు పేటీఎం చెల్లింపుల బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్‌ అవుతుంది. మార్చి 15 తర్వాత పరిస్థితి ఏంటి?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ వరకు చెల్లింపు కొనసాగుతుంది. ఖాతా ఖాళీ అయ్యాక ఇబ్బంది పడకుండా ఉండాలంటే వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి నెలా నా లోన్ EMI ఆటోమేటిక్ చెల్లింపు జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ వరకు EMI చెల్లింపు యథావిధిగా జరుగుతుంది. మార్చి 15 తర్వాత, ఆ ఖాతాలో డబ్బు జమ చేయలేరు. అందువల్ల, అసౌకర్యాన్ని నివారించడానికి వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – నా లోన్ EMI చెల్లింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా ఇతర బ్యాంక్‌లోని నా ఖాతా ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్‌ జరుగుతుంది. ఇది కొనసాగించవచ్చా?

సమాధానం – అవును, EMI చెల్లింపును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ నుంచి కాకుండా మరే ఇతర బ్యాంక్‌ ఖాతా నుంచైనా కొనసాగించవచ్చు.

ప్రశ్న – నా వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. దీనిని ఉపయోగించవచ్చా?

సమాధానం – అవును, మార్చి 15 తర్వాత కూడా, వాలెట్‌ ఖాళీ అయ్యే వరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. డబ్బు బదిలీ చేయడానికి మార్చి 15 లోపు దీనిని ఉపయోగించవచ్చు.

ప్రశ్న – నా వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. దానిని టాప్ అప్ చేయవచ్చా? వేరొకరి నుంచి ఈ వాలెట్‌లోకి డబ్బు డిపాజిట్ చేయవచ్చా?

సమాధానం – లేదు, క్యాష్‌బ్యాక్, రిఫండ్ మాత్రమే వస్తాయి. ఇది కాకుండా, మార్చి 15 తర్వాత ఏ విధంగానూ టాప్ అప్ చేయడం కదరదు.

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని క్లోజ్‌ చేసిన తర్వాత, మిగిలిన బ్యాలెన్స్‌ను ఇతర బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చా?

సమాధానం – అవును, మీరు ఫుల్‌ KYC వాలెట్‌ను మూసేసి, ఆ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. మినిమమ్‌ KYC వాలెట్ డబ్బును ఉపయోగించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: గడువు సమీపిస్తోంది, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని 3 కోట్ల ఖాతాల పరిస్థితి ఏంటి?



Source link

Related posts

Mega 157 Movie Shooting Starts From November మెగా 157 మొదలయ్యేది అప్పుడే!

Oknews

‘కథ వెనుక కథ’ మూవీ రివ్యూ 

Oknews

నేను చచ్చాక కూడా  మీ సానుభూతి అక్కర్లేదు 

Oknews

Leave a Comment