Sports

RCB Vs LSG IPL 2024 Royal Challengers Bengaluru need 182runs


Royal Challengers Bengaluru need 169 runs: లక్నో బ్యాటర్‌ క్వింటన్‌  డికాక్‌  అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన వేళ… బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో పోరాడే స్కోరు చేసింది. డికాక్‌ 56 బంతుల్లో 8 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. డికాక్‌ మినహా మిగిలిన బ్యాటర్లు ఆశించిన మేర రాణించకపోవడంతో  లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి  181 పరుగులు చేసింది. 

మ్యాచ్‌ సాగిందిలా…
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు… లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన ఆర్సీబీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించారు. రీస్‌ టాస్లీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో డికాక్‌ మూడు ఫోర్లు కొట్టాడు. సిరాజ్‌ బౌలింగ్‌లోనూ వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన డికాక్‌… బెంగళూరు బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాక్‌వెల్‌ వేసిన ఆరో ఓవర్‌లో లక్నో సారధి కే.ఎల్‌. రాహుల్‌ అవుటయ్యాడు. దీంతో 54 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. పవర్ ప్లే పూర్తయ్యే సరికి బెంగళరు 54 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో డికాక్‌ ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. డికాక్‌ ఒంటరి పోరాటంతో లక్నో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 84 పరుగులు చేసింది. ఈ క్రమంలో క్వింటన్‌ డికాక్‌ 36 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 22వ అర్థ శతకాన్ని డికాక్‌ పూర్తి చేశాడు. కామెరూన్‌ గ్రీన్‌ వేసిన 13 ఓవర్‌లో  డికాక్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. మాక్స్‌ వెల్‌ బౌలింగ్‌లో స్టోయినిస్‌ అవుట్‌ అయ్యాడు. 14 ఓవర్లకు 129 పరుగులు చేసింది. శతకం దిశగా సాగుతున్న క్వింటన్‌ డికాక్‌ ను రీస్‌ టాప్లీ అవుట్‌ చేశాడు. డికాక్‌ 56 బంతుల్లో 8 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. 18 ఓవర్‌లో చివరి బంతికి బదోని అవుట్‌ అయ్యాడు. రీస్‌ టాప్లీ వేసిన ఓవర్‌లో నికోలస్‌ పూరన్‌..మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. నికోలస్‌ పూరన్‌ 21 బంతుల్లో 1 ఫోర్‌, అయిదు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. దీంతో అయిదు వికెట్లతో 181 పరుగులు చేసింది. 
 
బ్యాటింగ్‌ కష్టాలు తీరుతాయా..?
బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేసేందుకు కష్టపడుతున్నాడు, RCB బ్యాటింగ్ లైనప్‌ పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్నా  మైదానంలో కోహ్లీ ఒక్కడే పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో స్థిరంగా రాణిస్తున్నాడు. డు ప్లెసిస్, రజత్‌ పాటిదార్‌,  గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దారుణంగా విఫలమవుతున్నారు. కానీ దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్‌లు రాణిస్తుండడంతో లోయర్‌ ఆర్డర్‌ పర్వాలేదనిపిస్తోంది. బెంగళూరు జట్టులో సీనియర్ బ్యాటర్ల వైఫల్యం… సీనియర్ల బౌలర్లకు పాకాయి. మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమతున్నాడు. బెంగళూరు జట్టులో లీడ్ పేసర్ అయిన సిరాజ్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు, సిరాజ్‌ ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. IPL 2023 సమయంలో  స్థిరంగా రాణించిన సిరాజ్‌… ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.

మరిన్ని చూడండి



Source link

Related posts

MS Dhoni In An Interview About First Ipl

Oknews

Pathum Nissanka Becomes First Sri Lankan To Slam Double Century In ODIs

Oknews

Yashasvi Jaiswal Double Century Ind vs Eng Second Test

Oknews

Leave a Comment