మరోవైపు ఈ ట్వీట్ కు సంబంధించి నెటిజన్లు నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇది నిజమేనా వర్మ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమేనా…? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీపై పోస్టు చేసిన కాసేపటికే మరో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. సందేహించేవారందరికీ చెబుతున్నాను… ‘ఐయామ్ సూపర్ సీరియస్’ అంటూ పోస్టును వదిలారు.