Road Accident : నల్గొండ (Nalgonda ) జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)లో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. గుర్తు తెలియని వాహనం కారును ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు ( Five) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నార్కట్‌పల్లి – అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో ఇంటికి చేరుతుందనగా…లారీ రూపంలో మృత్యువు కబలించింది. రెండు కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది.
మృతులు వీరే…
మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్ (32), ఆయన భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32), ఆయన కుమారుడు లియాన్సీ (2) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. మిర్యాలగూడలో ప్రాథమిక చికిత్స తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని…కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మృతుడు మహేశ్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి ఈ కారును ఢీకొట్టింది