పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవడు అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అంటే టీడీపీ నేత వర్మ తాకనివ్వకపోతే తన్నుకెళ్తాడు అని ఒక ఎలివేషన్ ఎలక్షన్స్ లో ఇచ్చారు గుర్తుందా. అచ్చం అలాంటి ఎలివేషనే నిన్న కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కొహ్లీ గురించి కూడా ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్ లో ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కొహ్లీ ఒక్క మ్యాచులోనూ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. నిన్న అంత కీలకమైన ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచులోనూ విరాట్ 9పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో 5సింగిల్ డిజిట్లకే పరిమితం అయ్యాడు. రెండు సార్లు డకౌట్ అయ్యాడు. 2012 నుంచి టీ20 వరల్డ్ కప్పులు ఆడుతున్న విరాట్ 2022 వరల్డ్ కప్పు వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయ్యాడు. కానీ 2024 వరల్డ్ కప్పులోనే 7 మ్యాచుల్లోనే 5సార్లు పదిపరుగులకు చేరలేకపోవటం చాలా అరుదనే చెప్పాలి. నిన్న అవుటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ దగ్గర బాధపడుతున్న విరాట్ కొహ్లీ దగ్గరకి కోచ్ రాహుల్ ద్రవిడ్ వచ్చి సముదాయించటం కూడా కనిపించింది. ఎందుకంటే కింగ్ గురించి అతని పరుగుల దాహం గురించి మనకు తెలియంది కాదు. తనను టార్గెట్ చేసిన బౌలర్లను గుర్తు పెట్టుకుని మరీ సంవత్సరాల తర్వాతైనా వడ్డీతో సహా చెల్లించేస్తాడు. అంత సీరియస్ నెస్ ఉన్న ఆటగాడు ఇలా కీలక సమయాల్లో వరల్డ్ కప్ లాంటి స్టేజ్ లో రాణించలేకపోవటం అతనికి కూడా చాలా ఇబ్బంది గా ఉంటుంది. దీన్ని పోగొడదాం అనుకున్నాడేమో రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో విరాట్ కొహ్లీ గురించి మాట్లాడాడు. కొహ్లీ బలం ఏంటో ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదన్న రోహిత్…బహుశా అతను ఫైనల్ బాగా ఆడటం కోసం శక్తినంతా దాచుకుంటున్నాడేమో అంటూ చిలిపిగా నవ్వేశాడు. అదీ కింగ్ అంటే. అతని ఆట గురించి రోహిత్ శర్మతో అతనికున్న బాండ్ గురించి ఈ డైలాగ్ అండ్ ఈ ఎలివేషన్ చాలంటూ కింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. విరాట్ కొహ్లీ సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్లో అయినా గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చి వరల్డ్ కప్ టీమిండియాకు అందివ్వాలని కోరుకుంటున్నారు.
క్రికెట్ వీడియోలు
India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లు
మరిన్ని చూడండి