మన భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పంచుల గురించి,ఫన్ గురించి తెలిసిందే కదా. మ్యాచులకు ముందు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రిపోర్టర్ల అడిగే ప్రశ్నలకు చాలా ఫన్నీ రిప్లయిస్ ఇస్తుంటాడు. ఇప్పుడు వరల్డ్ కప్ ముందు కెప్టెన్స్ కార్నర్ అని ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అక్కడికి కెప్టెన్స్ అందరూ హాజరయ్యారు. అక్కడ ఓ రిపోర్టర్ రోహిత్ శర్మను 2019 ప్రపంచకప్ ఫైనల్ గురించి ఓ ప్రశ్న అడిగాడు.