RR vs RCB IPL 2024 Preview and Prediction: ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB)….అగ్ని పరీక్ష ఎదుర్కోనుంది. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న రాజస్థాన్(RR) తో బెంగళూరు కఠిన పరీక్ష ఎదుర్కోనుంది. వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఎనిమిదో స్థానంలో ఉన్న బెంగళూరుతో తలపడనుంది.
బెంగళూరు.. కంగారు…
బెంగళూరు జట్టులో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్‌లతో కూడిన RCB టాపార్డర్… పేపర్‌పై చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో వీరు వరుసగా విఫలమవుతండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే బెంగళూరు జట్టులో స్థిరంగా రాణిస్తున్నాడు. రెండు అర్ధసెంచరీలతో ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 203 పరుగులు చేసిన విరాట్… ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులతో బెంగళూరు ఓటమిపాలైనా పాటిదార్ పర్వాలేదనిపించాడు. సవాయ్ మాన్ సింగ్ స్టేడిచంలో బెంగళూరు జట్టు తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. సవాయ్‌మాన్ సింగ్ స్టేడియం బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు విధ్వంసం సృష్టిస్తే…. విజయం అంత కష్టమేమీ కాదు. అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉండడం కూడా ఇరు జట్లకు కలిసిరానుంది.
రాజస్థాన్ అదొక్కటే లోటు..
ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాణించకపోవడం ఒక్కటే రాజస్థాన్‌ను ఆందోళన పరుస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో జైస్వాల్ కేవలం 39 పరుగులే చేశాడు. జోస్ బట్లర్ కూడా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ఇంగ్లండ్ T20 కెప్టెన్ కూడా అయిన బట్లర్.. ఇంకా ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. బట్లర్ మూడు మ్యాచుల్లో కేవలం 35 పరుగులే చేశాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ బట్లర్ స్ట్రైక్ రేట్ కేవలం 85 మాత్రమే ఉండడం రాజస్థాన్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనపరుస్తోంది. రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ సంజూ శాంసన్ (109 పరుగులు, ఒక అర్ధశతకం), రియాన్ పరాగ్ (181 పరుగులు, 2 అర్ధశతకాలు) మోస్తున్నారు. వీరిద్దరికీ మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం లభించడం లేదు. ఈ సమస్యలను అధిగమించాలని రాజస్థాన్ చూస్తోంది. బౌలింగ్ విభాగంలో రాజస్థాన్… బెంగళూరు కంటే కాస్త మెరుగ్గా ఉంది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్, నాండ్రే బర్గర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌లో ఏదైనా లోపం ఉంటే అది అశ్విన్ ఫామే. రవిచంద్రన్ అశ్విన్ .. ఓవర్‌కు 8.3 పరుగులు ఇచ్చి మూడు మ్యాచ్‌లలో ఒక వికెట్ తీసుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ దీప్, ఆకాశ్‌కుమార్, వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కుర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, కేశవ్ మహరాజ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ , అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్.
మరిన్ని చూడండి