ఇటీవలే తెలుగు సినిమా హీరో రామ్‌చరణ్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మొక్కలు నాటి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందాన్ని కూడా మొక్కలు నాటమంటూ ఈ చాలెంజ్‌కు ఎంపిక చేశారు. చరణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందం మొక్కలను నాటారు. దర్శకులు రాజమౌళి, కెమెరామేన్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, దర్శకత్వ శాఖ ఇలా అందరూ మొక్కలు నాటుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లమంటూ ‘ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప’ చిత్రబృందాలను ఎంపిక చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూనిట్. దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, వీవీ వినాయక్, పూరి జగన్నాథ్‌లను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు ఎంపిక చేశారు రాజమౌళి. రాజమౌళి విసిరిన ఈ చాలెంజ్‌కు ట్విట్టర్‌లో రామ్‌గోపాల్ వర్మ సరదాగా కామెంట్ చేశారు . ‘రాజమౌళిగారూ.. నేను చాలెంజ్‌లు, పచ్చదనం వంటి విషయాల మీద పెద్దగా ఆసక్తి లేనివాణ్ణి. అలాగే చేతికి మట్టి అంటుకుంటే మహా చిరాకు నాకు. నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటడం కంటే వేరెవరైనా ఆ పని చేయడం మంచిదని నా అభిప్రాయం. మీకూ మీ మొక్కలకూ ఓ దండం’ అని ట్వీట్ చేశారు వర్మ.