SA vs Afg Semifinal 1 Preview: సౌతాఫ్రికా, ఆఫ్గనిస్థాన్. ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో తలపడతాయని ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ ఆఫ్గాన్ షాకుల మీద షాకులు ఇచ్చి సెమీ ఫైనల్ కి వచ్చింది. మరో సౌతాఫ్రికా ఓటమి అనేదే లేకుండా సెమీస్ కు చేరుకుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఓసారి లిస్ట్ చూడండి. ఇది సౌతాఫ్రికా ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఆడిన మ్యాచుల లిస్ట్. నాలుగు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. మూడు సార్లు ఛేజింగ్ చేసి గెలిచింది సౌతాఫ్రికా. కానీ ఏ మ్యాచు కూడా సౌతాఫ్రికా స్థాయి విజయం కాదు చూడండి. శ్రీలంక టీమ్ మీద ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఫస్ట్ మ్యాచే సౌతాఫ్రికా సాధికారికంగా సాధించిన పెద్ద విజయం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత నెదర్లాండ్స్ మీద నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా దేశ్ మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. నేపాల్ మీద ఆల్మోస్ట్ ఓడిపోయేది. ఒక్క పరుగు తేడాతో గెలిచింది సౌతాఫ్రికా. ఇక సూపర్ 8లో యూఎస్ఏ మీద 18పరుగులు, ఇంగ్లండ్ మీద 7పరుగుల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా..వెస్టిండీస్ మీద 3వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ కు వచ్చింది. సౌతాఫ్రికా ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలా అని ఏదీ ఘన విజయం కూడా కాదు. అన్నీ క్లోజ్ గా మ్యాచ్ ను తీసుకువచ్చి గెలుచుకుంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆఫ్గానిస్థాన్ అలా కాదు. తన కంటే ఎంతో బలమైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను మట్టికరిపించింది.
ఆట వీడియోలు
SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరో
మరిన్ని చూడండి