Sania Mirza will contest as Hyderabad Congress candidate : సానియా మీర్జా రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. టీం ఇండియా కెప్టెన్ గా పనిచేసి రాజకీయ రంగప్రవేశం చేసిన అజహరుద్దీన్ సానియా మీర్జాకు సమీప బంధువు. గతంలో ఇద్దరూ క్రీడాకారులైనా సానియా చెల్లెలి పెళ్లితో వారి మధ్య బంధుత్వం ఏర్పడింది. అజహరుద్దీన్ గతంలో కాంగ్రెస్ ఎంపీగా కూడా పనిచేశారు. అజహరుద్దీన్ తన కుమారుడి అసద్ కు సానియామీర్జా చెల్లెలు ఆనంమీర్జాతో వివాహం జరిపించారు. అసద్-ఆనంమీర్జాల పెళ్లితో అజహరుద్దీన్ సానియామీర్జాకు దగ్గరి బంధువయ్యారు. దీంతో హైదరాబాద్ ఎంపీ బరిలో సానియా మీర్జాను బరిలోకి దించాలని కాంగ్రెస్ నాయకుడైన అజహరుద్దీన్ ప్రతిపాదించినట్లు హస్తిన కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ గత బీఆర్ఎస్ పాలనలో సానియామీర్జా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడరుగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సానియా పలు సార్లు కలిసినా, అప్పట్లో టెన్నిస్ క్రీడాకారిణిగానే ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో ముస్లిం ఓటర్లు 50శాతానికి పైగా ఉండటంతోపాటు స్టార్ ఇమేజ్ ఉన్న సానియా మీర్జాను ఎన్నికల బరిలోకి దించితే విజయం ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకుల తర్వాత సానియా మీర్జాకు తాజాగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎన్టీటీవీ వారు అందించిన ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో రెడ్ కార్పెట్ పై ఉన్న తన కుమార్తె సానియామీర్జా ఫొటోను ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా పోస్టు చేశారు. వెలుగు జిలుగుల మధ్య వేదికపై తనదైన మేకప్ తో గ్లామరస్ గా సానియా అవార్డు అందుకుంది.ఈ అవార్డు పొందిన సానియాకు పలువురు అభిమానులు ప్రశంసించారు.
అయితే సానియా ఇంత వరకూ రాజకీయ పరమైన కామెంట్లు కానీ.. తనకు ఆసక్తి ఉన్నట్లుగా కానీ ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కాంగ్రెస్ నేతల్ని కలిసినట్లుగా కూడా స్పష్టత లేదు. అదే సమయంలో మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అసదుద్దీన్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెడతారని అనుకోవడం లేదు. సానియా మీర్జాకు.. ముస్లిం యువతలో క్రేజ్ ఉంటుంది. ఎలా చూసినా.. అసదుద్దీన్ కు.. ముస్లిం ఓట్లు మైనస్ అవుతాయి. మరో వైపు బీజేపీ హిందూ ఓట్లను ఏకం చేస్తే.. అసదుద్దీన్ కు గట్టి పోటీ ఎదురు కావొచ్చు. బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ కు సహకరించేలా హిందూ అభ్యర్థిని ఖరారు చేసినా ఆయన పలుకుబడి ఉన్న నేత కాదు కాబట్టి.. బీఆర్ఎస్ చీల్చే ఓట్లు స్వల్పమేనన్న అభిప్రాయం ఉంది.
మరిన్ని చూడండి
Source link