Telangana

sbi debit card customers need to pay more from 01 april as bank raises maintenance charges



SBI Debit Card Charges Hike From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌, తన కోట్లాది మంది కస్టమర్లను కష్టపెట్టే నిర్ణయం తీసుకుంది. తన వివిధ డెబిట్ కార్డ్‌/ ATM కార్డ్‌ వార్షిక నిర్వహణ ఛార్జీలను (Annual maintenance charges) పెంచింది. 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీ 75 రూపాయలు పెరిగింది. మీ దగ్గర ఎన్ని కార్డ్‌లు ఉంటే అన్ని రూ.75లు మీ నుంచి వసూలు చేస్తుంది. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్‌ ఖాతా నుంచి తగ్గుతుంది. అంటే, మీకు తెలీకుండానే మీ డబ్బును బ్యాంక్‌ లాక్కుంటుంది.
డెబిట్ కార్డ్‌ల మీద కొత్త వార్షిక నిర్వహణ ఛార్జీల బాదుడు కోసం, SBI, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని ముహూర్తంగా ఎంచుకుంది. ఈ రోజు ( 01 ఏప్రిల్ 2024) నుంచి స్టేట్‌ బ్యాంక్‌ కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు SBI డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా SBI దేశంలోనే అతి పెద్ద బ్యాంక్.
ఎస్‌బీఐకి చెందిన ఏ డెబిట్‌ కార్డ్‌ మీద ఎంత చార్జీ?
– క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ యూజర్లు 01 ఏప్రిల్‌ 2024 నుంచి నిర్వహణ ఛార్జీ రూపంలో రూ. 200 + GST చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ. 125 + GSTగా ఉంది. – యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) యూజర్ల నుంచి ప్రస్తుతం ఉన్న రూ. 175 + GSTకి బదులుగా రూ. 250 + GSTని బ్యాంక్‌ వసూలు చేస్తుంది. – ప్లాటినం డెబిట్ కార్డ్ వినియోగదార్ల నుంచి ఇప్పుడున్న రూ. 250  + GSTకి బదులుగా రూ. 325  + GSTని వసూలు చేస్తుంది. – ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుత రూ. 350 + GST నుంచి రూ. 425  + GSTకి పెరుగుతుంది. 
క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్లు కూడా మాయం
డెబిట్‌ కార్డ్‌ విషయంలోనే కాదు, క్రెడిట్ కార్డ్ విషయంలోనూ స్టేట్‌ బ్యాంక్‌ ఈ రోజు నుంచి కొన్ని మార్పులు తీసుకొచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card), కొన్ని క్రెడిట్ కార్డులపై వచ్చే రివార్డ్ పాయింట్లను రద్దు చేసింది. ఈ అప్‌డేట్‌ ప్రకారం… AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ కార్డ్‌ హోల్డర్ల మీద ఈ ప్రభావం పడింది. ఈ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై 31 మార్చి 2024 వరకు రివార్డ్‌ పాయింట్లు ఇచ్చింది. ఈ రోజు నుంచి రివార్డ్‌ పాయింట్లు రావు. 
అంతేకాదు, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మరో నష్టాన్ని కూడా భరించాలి. పైన చెప్పిన కార్డ్‌లతో అద్దె చెల్లించడం ద్వారా ఇప్పటి వరకు వచ్చిన రివార్డ్ పాయింట్‌ల గడువు ఈ నెల 15తో ముగుస్తుంది. అంటే, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా అద్దె చెల్లించి, అందుకోసం కొన్ని రివార్డ్ పాయింట్లను ఇప్పటికే పొందితే, ఆలస్యం చేయకుండా వాటిని ఉపయోగించండి. లేకపోతే, ఈ నెల 15 తర్వాత ఆ పాయింట్లు చెల్లవు.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు బ్యాంక్‌ వైపు వెళ్లకండి, ఈ నెలలో మొత్తం 14 సెలవులు

మరిన్ని చూడండి



Source link

Related posts

ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణం.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన ఉన్నతాధికారి కోసం అన్వేషణ-a new angle in phone tapping search for a high official who traveled in the joint karimnagar district ,తెలంగాణ న్యూస్

Oknews

Jharkhand MLAs Camp : హైదరాబాద్ కు మారిన ‘జార్ఖండ్’ రాజకీయం

Oknews

Harish Rao on Cm Revanth Reddy | Harish Rao on Cm Revanth Reddy | ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్

Oknews

Leave a Comment