Sports

Shamar Joseph Win ICC Player Of The Month Award


Shamar Joseph win ICC Player of the Month award: షమార్‌ జోసెఫ్‌(Shamar Joseph)… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈ విండీస్‌ సీమర్‌ నిప్పులు చెరిగే బంతులకు బౌలింగ్ దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. కంగారులను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్‌కు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు. గబ్బాలో అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు. ఈ వెస్టిండీస్‌ నయా సంచలనానికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గత నెలలో షెమర్‌ జోసెఫ్‌ ప్రదర్శనలకు గాను అతడు జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ఐసీసీ అవార్డు
 ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌, ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ జోష్‌ హెజిల్‌వుడ్‌లను వెనక్కినెట్టి జోసెఫ్‌ జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టులో విండీస్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జోసెఫ్‌.. టెస్టులలో తొలి వికెట్‌గా స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీశాడు. ఇటీవలే లక్నో జట్టు రూ. 3.6 కోట్లతో షెమర్‌ను జట్టులోకి తీసుకుంది. ఎంట్రీ ఇచ్చి నెల రోజులు కాకముందే సంచలనాలతో దూసుకుపోతున్న షెమర్‌ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

నేపథ్యం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే…
గయానా దీవుల్లోని ఫోన్లు, ఇంటర్నెట్‌లు లేని ఓ పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టాడు షమార్‌. ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్లాలంటే పడవలే దిక్కు. తొలుత కట్టెలు కొట్టే పని చేసే షమార్‌… తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం పట్టణానికి వలస వెళ్లి ఓ నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా మారాడు. ఆ తర్వాత అతను సెక్యూరిటీ గార్డుగానూ పని చేశాడు. రెండేళ్ల ముందు వరకు అతను అదే పనిలోనే ఉన్నాడు. వెస్టిండీస్‌ జాతీయ జట్టుకు ఆడిన రొమారియో షెఫర్డ్‌తో ఉన్న పరిచయం వల్ల అతను గయానా జట్టు కోచ్‌ దృష్టిలో పడ్డాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే సెలక్షన్‌ ట్రయల్స్‌కు వెళ్లాడు. అక్కడ ప్రతిభ చాటుకుని డివిజన్‌-1 క్రికెట్లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీశాడు. తర్వాత కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా ఛాన్స్‌ దక్కింది. అదే సమయంలో దిగ్గజ బౌలర్‌ ఆంబ్రోస్‌.. అతడి బౌలింగ్‌ చూసి మెచ్చుకున్నాడు. ఇంకో ఏడాదిలో నిన్ను గయానా జట్టులో చూడాలనుకుంటున్నానని  అన్నాడు. ఆంబ్రోస్‌ చెప్పిన గడువులోపే షమార్‌.. 2023 ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో, అలాగే గత ఏడాది కరీబియన్‌ లీగ్‌లో నిలకడగా రాణించడంతో ఇటీవలే వెస్టిండీస్‌ జాతీయ జట్టులోకి ఎంపికైన షమార్‌.. ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి సిరీస్‌లోనే సంచలన ప్రదర్శన చేసి హీరోగా మారాడు.



Source link

Related posts

Rohit Sharma Opens Up about the game plan Ahead Of IND vs ENG T20 World Cup 2024

Oknews

IPL 2024 RCB vs PBKS LIVE Score Updates Royal Challengers Bengaluru vs Punjab Kings RCB beat PBKS by 4 wickets | RCB vs PBKS: విరాట్ కోహ్లీ మెరుపులు

Oknews

ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?-rafael nadal knocked out of italian open second round by hubert hurkacz doubtful for french open 2024 ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

Leave a Comment