ByGanesh
Sun 25th Feb 2024 06:30 PM
గంజాయి కేసులో ఇరుక్కుని జైలు కెళ్లిన ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ నిన్న బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే షణ్ముఖ్ అరెస్ట్ అవడం పెద్ద నాటకీయ పరిణామం. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని చీట్ చేసాడనే కోణంలో అతన్ని అరెస్ట్ చెయ్యడానికి వెళ్లిన పోలీసులకి షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ దొరకడంతో అతన్ని అతని సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి తరలించారు. అయితే షణ్ముఖ్ ని అరెస్ట్ చేసే సమయంలో షణ్ముఖ్ తాను డిప్రెషన్ లో ఉన్నాను, ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను, తన పరిస్థితి ఏమి బాగోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
పోలీసులు షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకునే సమయంలో షణ్ముఖ్ పోలీసులతో వాదిస్తున్న వీడియో అది. షణ్ముఖ్ ప్రేమకి దీప్తి సునయన బ్రేకప్ చెప్పడంతో డిప్రెషన్ లోకి వెళ్ళాడంటూ షణ్ముఖ్ లాయర్ చెప్పినట్లుగానే నిజంగా అతను డిప్రెషన్ లో ఉండే గంజాయికి బానిస అయ్యాడా? అసలు అతనికి గంజాయి సప్లై చేసేది ఎవరు? షణ్ముఖ్ తో పాటుగా అతని సోదరుడు సంపత్ కి కూడా గంజాయి తీసుకునే అలవాటు ఉందా? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Shanmukh Jaswanth who wanted to commit suicide:
Shanukh Jaswanth comments about his mental condition after caught with ganja