Telangana

sheduled banks will be open on this sunday as per rbi guideline you can avail these services



Banks Works on Sunday: ఈ ఆదివారం (మార్చి 31) బ్యాంక్‌లకు సెలవు లేదు, పని చేస్తాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. RBI ప్రకటన ప్రకారం… 2024 మార్చి 30, శనివారం రోజున & మార్చి 31 ఆదివారం రోజున అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేస్తాయి. ఆ రోజున ఏజెన్సీ బ్యాంక్‌ల అన్ని శాఖలు తెరిచి ఉంచాలని కేంద్ర బ్యాంక్‌ ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం, శనివారం, ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి. 
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 
స్పెషల్‌ డిపాజిట్‌ పథకాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), కిసాన్‌ వికాస్‌ పత్ర ‍‌(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో కనీస డిపాజిట్‌ చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి కూడా మార్చి 31 చివరి రోజు కాబట్టి, వీటికి సంబంధించిన లావాదేవీలను కూడా అనుమతిస్తారని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. శని, ఆదివారాల్లో బ్యాంకుల్లో డబ్బులు వేయడం, తీయడం వంటి సాధారణ లావాదేవీలను కూడా అనుమతిస్తారా, లేదా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. 
ఏజెన్సీ బ్యాంకులు అంటే ప్రభుత్వ లావాదేవీలను సెటిల్‌ చేసేందుకు అధికారం ఉన్న బ్యాంకులు. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులు సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి, ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈ బ్యాంక్‌లు సెటిల్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగే అన్ని ప్రభుత్వ లావాదేవీలను ఈ ఆర్థిక సంవత్సరం ఖాతాల్లో నమోదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. ఈ కారణంగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజును ఏజెన్సీ బ్యాంక్‌లు పనిదినంగా పాటించాలని, ఆదివారం అయినప్పటికీ అన్ని శాఖలను తెరవాలని ఆదేశించింది.
ఏజెన్సీ బ్యాంక్‌ల లిస్ట్‌లో ఉన్న 33 బ్యాంక్‌లు
1. బ్యాంక్ ఆఫ్ బరోడా2. బ్యాంక్ ఆఫ్ ఇండియా3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర4. కెనరా బ్యాంక్5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా6. ఇండియన్ బ్యాంక్7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్9. పంజాబ్ నేషనల్ బ్యాంక్10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా11. UCO బ్యాంక్12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా13. యాక్సిస్ బ్యాంక్14. సిటీ యూనియన్ బ్యాంక్15. DCB బ్యాంక్16. ఫెడరల్ బ్యాంక్17. HDFC బ్యాంక్ 18. ICICI బ్యాంక్ 19. IDBI బ్యాంక్ 20. IDFC ఫస్ట్‌ బ్యాంక్21. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 23. కర్ణాటక బ్యాంక్ 24. కరూర్ వైశ్యా బ్యాంక్ 25. కోటక్ మహీంద్ర బ్యాంక్ 26. RBL బ్యాంక్ 27. సౌత్ ఇండియన్ బ్యాంక్ 28. యెస్ బ్యాంక్ 29. ధనలక్ష్మి బ్యాంక్ 30. బంధన్ బ్యాంక్ 31. CSB బ్యాంక్ 32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 33. DBS బ్యాంక్ ఇండియా
నోటిఫికేషన్‌లో RBI సూచించిన ప్రకారం… శని, ఆదివారాల్లో బ్యాంకులు ఎప్పటిలాగే సాధారణ సమయాల ప్రకారమే తెరిచి ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున (సోమవారం, 01 ఏప్రిల్‌ 2024) మాత్రం బ్యాంక్‌లు పని చేయవు, సెలవు తీసుకుంటాయి.
మరో ఆసక్తికర కథనం: మార్చి 31లోగా పూర్తి చేయాల్సిన పనులివి, మర్చిపోతే మీ జేబుకు చిల్లు!

మరిన్ని చూడండి



Source link

Related posts

Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!

Oknews

Andhra Pradesh Telangana Telugu Breaking News Live Updates 25 September 2023

Oknews

KCR : మన గళం బలంగా వినిపించాలి, త్వరలోనే ప్రజల మధ్యకి వస్తా

Oknews

Leave a Comment