Sheperd And Sheeps Died in Train Collision in Hanmakonda: హన్మకొండలోని (Hanmakonda) శాయంపేట (Sayampeta) రైల్వే గేటు వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతి చెందాయి. శాతవాహన రైలు వస్తున్న క్రమంలో అక్కడి సిబ్బంది గేటు వేయగా.. అప్పుడే రైలు రాదనుకుని గొర్రెల కాపరి గొర్రెలతో సహా ట్రాక్ దాటేందుకు యత్నించాడు. అయితే, అనుకున్న దాని కంటే రైలు వేగంగా రాగా గొర్రెలు ట్రాక్ పైనే ఉండిపోయాయి. వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గొర్రెలు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీన్ని చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana Cabinet : 12న తెలంగాణ కేబినెట్ భేటీ – మేనిఫెస్టోలోని కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్
మరిన్ని చూడండి