ప్రముఖ తెలుగు సినిమా గాయని సునీత తన వివాహంపై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు చెక్ పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్ననేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో ( Ram Veerapaneni) సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం (Singer Sunitha Engagement) జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే సునీత పెళ్లి చేసుకునే రామ్‌కి కూడా ఇది రెండో వివాహమే. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్‌మెంట్ (Singer Sunitha Engagement with Ram) చేసుకోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఇక గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సునీత సంపాదించుకున్నారు. పాతికేళ్లుగా ఎన్నో పాటలను తన మధురగానంతో అలరించిన సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.పెళ్లి ఎప్పుడు, ఎక్కడ వంటి వివరాలు తెలియవు కానీ.. దాంపత్య బంధానికి తెరలేపింది. మ్యాంగ్ న్యూస్ అధినేత రామ్ కూడా భార్యకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు.