తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా స్నేహ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. స్నేహ ఖాతాలో శ్రీరామదాసు, వెంకీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వివాహం తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ప్రముఖ నటుడు ప్రసన్న వెంకటేశన్ ని స్నేహ వివాహం చేసుకుంది. తమిళంలో వీరిద్దరూ కలసి ఓ చిత్రంలో నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నాలుగేళ్ళ కుమారుడు విహాన్ ఉన్నాడు. స్నేహ రెండోసారి తల్లి కాబోతోంది. తాను గర్భవతిగా ఉన్నట్లు స్నేహ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
స్నేహ మరోసారి తల్లి కాబోతోందని తెలిసినప్పటి నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయట. సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆమెకు ఫోన్స్, మెసేజెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Topics: