ByMohan
Sun 21st Jan 2024 11:54 AM
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిన హీరోయిన్ తృప్తి డిమ్రీ. ఆ సినిమా తర్వాత సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక కంటే కూడా ఎక్కువగా తృప్తి డిమ్రీ గురించి చర్చ జరిగింది. యానిమల్ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటించిందనేది పక్కన పెడితే.. ఆ సినిమా ఆమెకు సరైన గుర్తింపును తెచ్చిపెట్టిందని మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే, వరల్డ్ మొత్తం ఆమె గురించి మాట్లాడుకునేలా చేసిందా చిత్రం.. అందులోని ఆమె పాత్ర. ఇంకా చెప్పాలంటే.. యానిమల్ సినిమా తర్వాత రష్మిక ఎన్ని సినిమాలకు సైన్ చేసిందో తెలియదు కానీ.. తృప్తి డిమ్రీకి మాత్రం తెగ అవకాశాలు వచ్చిపడుతున్నట్లుగా అయితే టాక్ నడుస్తోంది.
తాజాగా ఆమెకు టాలీవుడ్ నుండి కూడా పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదీ కూడా ఇంతకు ముందు శ్రీలీల ఓకే చెప్పిన పాత్రకి ఇప్పుడు తృప్తి డిమ్రీని తీసుకుంటున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒకటే వార్తలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చేయనున్నాడు. ఈ సినిమాకు మొదట శ్రీలీలను ఫిక్స్ చేశారు. కానీ, ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా సమాచారం.
ఇప్పుడామె ప్లేస్‌లో తృప్తి డిమ్రీని మేకర్స్ సంప్రదించారని, ఈ సినిమా కథ తెలుసుకున్న ఆమె.. ఇందులో చేయడానికి ఓకే చెప్పారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తృప్తి డిమ్రీ విషయమై మేకర్స్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ నిజం అయితే మాత్రం.. టాలీవుడ్‌లో చక్రం తిప్పడానికి తృప్తి డిమ్రీకి శ్రీకారం పడినట్లేనని చెప్పుకోవచ్చు. చూద్దాం.. ఫైనల్‌గా ఆమె పేరు ఉంటుందో.. లేదో..
Sreeleela Out and Tripti Dimri in for VD:
Rowdy Star to Romance With Animal Beauty