ByGanesh
Mon 19th Feb 2024 04:26 PM
బ్యూటిఫుల్ గర్ల్, లక్కీ గర్ల్ శ్రీలీల ఇప్పుడు కెరీర్ లో కాస్త డల్ అయ్యింది. టాలీవుడ్ కి తారాజువ్వలా దూసుకొచ్చిన శ్రీలీల రెండేళ్లలో ఏడెనిమిది చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందానికి అందం, డాన్స్ కి డాన్స్ తో శ్రీలీల ప్రత్యేకంగా కనిపించడంతో యంగ్ హీరోలంతా శ్రీలీల వెంట పడ్డారు. కానీ ఆమెని తమ సినిమాల్లో సరిగ్గా వినియోగించుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వరస వైఫల్యాలతో ప్రస్తుతం శ్రీలీల మాట టాలీవుడ్ లో వినిపించడం లేదు.
శ్రీలీల మాత్రం హడావిడిగానే కనబడుతుంది. వస్త్ర దుకాణం ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ అంటూ బిజీగానే ఉంది. ఇక ఈరోజు సోమవారం శ్రీలీల తిరుమల తిరుపతి వెళ్లి అక్కడ విఐపి బ్రేక్ దర్శనంలో వేంకటేశ్వరుని దర్శించుకుంది. తన తల్లితో కలిసి శ్రీలీల శ్రీవారిని దర్శించుకుంది. పట్టుపరికిణీ, ఓణీతో శ్రీలీల అచ్చతెలుగు ఆడపిల్లలా, కుందనపు బొమ్మలా శ్రీవారి దర్శనానికి విచ్చేసింది.
శ్రీవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటుగా ఆమెకు తీర్ధప్రసాదాలు అందజేశారు. తర్వాత శ్రీలీల మీడియాతో మట్లాడుతూ మాఢవీధుల్లో కనిపించింది.
Sreeleela Visits Tirumala Tirupati Devasthanam:
Sreeleela Visits Tirumala Tirupati Devasthanam With Her Mother