Telangana

summer training camps under vivekananda institute of human excellence | Hyderabad News: విద్యార్థులకు గుడ్ న్యూస్



Summer Training Camp In Hyderabad: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సంస్కార్ – 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. 4 నుంచి ఏడో తరగతి వరకు జరిగే శిక్షణా శిబిరం.. ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10న ముగుస్తాయి. 12 రోజుల పాటు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. అలాగే 8, 9, 10వ తరగతుల వారికి మే 14 నుంచి మే 25 వరకు క్లాసులు జరగనున్నాయి. ఇవి కూడా 12 రోజుల పాటు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. వెబ్ సైట్‌లో సంబంధిత కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీఐహెచ్ఈ తెలిపింది. ఏప్రిల్ 28న ప్రారంభ ఈవెంట్ జరగనుంది.
ఏప్రిల్ 15 – 25 వరకు 12 రోజుల పాటు శ్రద్ధ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఇంటర్ విద్యార్థులు.. 11, 12 తరగతులకు చెందిన వారు అర్హులు. 12వ తరగతి ఫైనల్ పరీక్షలు రాసిన వారు కూడా అర్హులే. వీరికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఈ శిబిరంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసేలా స్వామిజీలు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు వాట్సాప్ నెంబర్ 9177232696 లో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.
Also Read: Telangana News: తెలంగాణలో ఆ 2 రోజులు వర్షాలు – మండే ఎండల్లో కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

మరిన్ని చూడండి



Source link

Related posts

Viral Fevers : ఆదిలాబాద్‌ను వణికిస్తున్న డెంగీ జ్వరాలు

Oknews

Sammakka Saralamma: నేటి నుంచి మేడారం జాతర.. కాసేపట్లో గద్దెపైకి సారలమ్మ.. భారీగా తరలి వస్తున్న భక్తులు

Oknews

ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో, పాస్ బుక్ కోసం రూ.40 లక్షల లంచం-shamirpet news in telugu mro taking 10 lakh bribe for land holder arrested ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment