Sports

Suryakumar Yadav Equals Virat Kohlis World Record In T20Is


Suryakumar Yadav Equals Virat Kohli’s Record: సూపర్‌ ఎయిట్‌(Super8)లో అఫ్గానిస్థాన్‌( AFG)తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్(Suryakumar Yadav) అద్భుత అర్ధ శతకంతో భారత్‌కు భారీ స్కోరు అందించి… విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్ బ్యాటర్లందరూ పెవిలియన్‌కు చేరిన వేళ హార్దిక్‌(Hardic)తో కలిసి సూర్య జట్టుకు కీలక పరుగులను అందించాడు. కేవలం 28 బంతుల్లోనే 53 పరుగులు చేసి టీమిండియా(Team India) 180 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. టీ 20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సూర్య స్థిరంగా నెంబర్ వన్‌ స్థానంలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్న అభిమానులు… అఫ్గాన్‌పై అత్యంత ఒత్తిడిలో అర్ధ శతకం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ సంబరపడిపోతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కింగ్‌ కోహ్లీ(Virat Kohli) రికార్డును సూర్య భాయ్‌ సమం చేశాడు. కోహ్లీపై పేరు ఉన్న రికార్డును అతని కంటే సగం మ్యాచుల్లోనే సూర్య సమం చేశాడు. దీంతో మరోసారి సూర్యపై క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. 

 

ఏమిటా రికార్డు

టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన అర్ధ సెంచరీని సాధించి… తాను ఎందుకు నంబర్ 1 టీ20 బ్యాటరో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, పంత్‌, కోహ్లీ త్వరగానే అవుటైనా సూర్య అర్ధ సెంచరీతో చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సూర్య 28 బంతుల్లో 53 పరుగులు చేయడంతో భారత్ 47 పరుగుల తేడాతో ఆఫ్గాన్‌ను ఓడించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సూర్య సమం చేశాడు. T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 15వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సూర్య నిలిచాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది. విరాట్‌ కోహ్లీ 113 ఇన్నింగ్స్‌ల్లో 15 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ సూర్య కోహ్లీతో పోలిస్తే సగం ఇన్నింగ్స్‌ల్లోనే 15 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికై సత్తా చాటాడు. సూర్యకుమార్ యాదవ్  కేవలం 61 ఇన్నింగ్సుల్లోనే 15 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికై కింగ్‌ కోహ్లీ రికార్డును సమం చేశాడు. 

 

సూర్యా ఏమన్నాడంటే..?

అఫ్గాన్‌తో మ్యాచ్‌ గెలిచిన అనంతరం సూర్య కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా సాంప్రదాయ షాట్లు ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌ చేయడాన్ని తాను ఆస్వాదిస్తానని…  ఎందుకంటే ప్రత్యర్థి బౌలర్లు అప్పుడు పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుంటారని ఆ దశలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని సూర్యా తెలిపాడు. అందుకే ఆ సవాల్‌ను స్వీకరించడం తనకు ఇష్టమని సూర్యాభాయ్‌ తెలిపాడు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని సూర్య తెలిపాడు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Eng vs Ban Match Highlights : World Cup 2023లో ఇంగ్లండ్ మొదటి విజయం | ABP Desam

Oknews

Mumbai Indians vs Royal Challengers Bangalore WPL 2024 RCB Beat MI by 5 Runs to Seal Spot in Final

Oknews

Glen Maxwell Alcohol Related Incident : వెస్టిండీస్ తో సిరీస్ నుంచి మ్యాక్స్ వెల్ అవుట్ | ABP Desam

Oknews

Leave a Comment