Sports

T20 World Cup 2024 Bangladesh beat Nepal to seal Super 8 qualification


BAN vs NEP T20 World Cup Highlights: టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో బంగ్లాదేశ్‌(Bangladesh) సూపర్‌ ఎయిట్‌కు దూసుకెళ్లింది. పసికూన నేపాల్‌(Nepal)తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన బంగ్లా సూపర్‌ ఎయిట్‌ బెర్తును ఖరారు చేసుకుంది. బంగ్లా సూపర్‌ ఎయిట్‌కు చేరడంతో… అన్ని గ్రూపుల నుంచి సూపర్‌ ఎయిట్‌ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్‌ ఏ నుంచి భారత్‌-అమెరికా, గ్రూప్‌ బీ నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌, గ్రూప్‌ సీ నుంచి అఫ్గానిస్థాన్‌- వెస్టిండీస్‌, గ్రూప్ డీ నుంచి సౌతాఫ్రికా-బంగ్లాదేశ్‌ సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించాయి. 

పసికూన తలవంచలేదు
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా గెలుపు కోసం చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నేపాల్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అలా బ్యాటింగ్‌కు దిగిందో లేదో బంగ్లాకు గట్టి షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. తమ్జీద్‌ హసన్‌ను తొలి బంతికే అవుట్‌ చేసిన నేపాల్‌ బౌలర్‌ సోంపాల్‌ కామీ బంగ్లాను తొలి దెబ్బ తీశాడు. ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ నేపాల్ బౌలర్లు ఏ దశలోనూ బంగ్లాను భారీ స్కోరు చేయనివ్వలేదు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు లేకుండానే తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లా… ఏడు పరుగులకే రెండు వికెట్‌ కోల్పోయింది. అయిదు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన బంగ్లా కెప్టెన్‌ శాంటోను ఐరో బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే లిట్టన్‌ దాస్‌ పది పరుగులు చేసి అవుట్ కావడంతో బంగ్లా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్కోరు బోర్డుపై మరో 9 పరుగులు చేరాయో లేదో 30 పరుగుల వద్ద బంగ్లా మరో వికెట్ కోల్పోయింది. తొమ్మిది పరుగులు చేసిన హ్రిదోయ్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో బంగ్లా 30 పరుగులకే నాలుగు వికెట్లు పీకల్లోతు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తుండడం నేపాల్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో ఈ మ్యాచ్‌లో పసికూన నేపాల్ అద్భుతం చేసేలా కనిపించింది. మహ్మదుల్లా రనౌట్‌ కావడం…జాకర్‌ అలీ కూడా త్వరగానే అవుట్‌ కావడంతో బంగ్లా వికెట్ల పతనం వేగంగా సాగింది. ఏ ఒక్క బంగ్లా బ్యాటర్‌ కూడా కనీసం 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయాడు. షకీబుల్‌ హసన్‌ 17 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లిట్టన్‌ దాస్‌ 10, మహ్మదుల్లా 13, జాకర్‌ అలీ 12, రిషద్‌ హోస్సెన్‌ 13, తస్కిన్ అహ్మద్‌ 12 పరుగులకే వెనుదిరిగారు. దీంతో 19.3 ఓవర్లలో బంగ్లా 106 పరుగులకే పరిమితమైంది. నేపాల్‌ బౌలర్లలో సోంపాల్‌ కామీ, దీపేంద్ర సింగ్‌, రోహిత్‌ పౌడెల్‌, సందీప్‌ లామిచెనే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

కష్టకష్టంగా..
 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌.. ఓ దశలో సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఈ దశలో బంగ్లా లీగ్‌ దశలోనే ఇంటికి వెనుదిరుగుతుందా అన్న ప్రశ్నలు కూడా చెలరేగాయి. ఓ దశలో 26 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన నేపాల్‌ ఇక లక్ష్యం సాధించడం కష్టమే అనిపించింది. కానీ నేపాల్ బ్యాటర్లు కుషాల్‌ మల్లా, దీపేంద్ర సింగ్ అయిరీ బంగ్లాను వణికించారు. కుషాల్‌ 27, దీపేంద్ర 25 పరుగులతో రాణించడంతో ఓ దశలో నేపాల్‌  78 పరుగులతో లక్ష్యం ఛేదించేలానే కనిపించింది. అయితే ముస్తాఫిజుర్ రెహ్మన్‌ వీరిద్దరని అవుట్‌ చేసి నేపాల్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. చివరికి నేపాల్‌ 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో హసన్‌ షకీబ్‌ నాలుగు ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ముస్తాఫిజర్‌ నాలుగు ఓవర్లలో ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

IPL 2024 Hardik Pandya completes 100 sixes for Mumbai Indians

Oknews

Rohit Sharma becomes 2nd player after MS Dhoni to play 250 matches in IPL

Oknews

Former Indian Cricket Team Captain Dattajirao Gaekwad Passes Away Know Stats Unknown Facts

Oknews

Leave a Comment