Back To Back Hat Trick For Pat Cummins : ఆస్ట్రేలియా( Australia) పేసర్ పాట్ కమిన్స్(Pat Cummins) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డును సృష్టించాడు. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌లో హ్యాట్రిక్ తీసిన కమిన్స్… అఫ్గాన్(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్ తీసి చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలా అయితే హ్యాట్రిక్ తీశాడో అదే విధంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వరుస బంతుల్లో వికెట్లు తీశాడు. వరుసగా రెండు మ్యాచుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. మరే బౌలర్ ఇంతవరకూ ఈ అరుదైన ఘనతను సాధించలేదు. టీ 20 ప్రపంచకప్‌లో రెండుసార్లు హ్యాట్రిక్లు తీసిన బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు.
రెండో హ్యాట్రిక్ ఇలా..
టీ 20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్… 148 పరుగులు చేసింది. తొలి వికెట్‌కే అఫ్గాన్ ఓపెనర్లు 118 పరుగులు చేయడంతో అఫ్గాన్ భారీ స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే కమిన్స్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో అది సాధ్యం కాలేదు. ఈ మెగా టోర్నమెంట్‌లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్‌లతో చరిత్ర సృష్టించిన కమిన్స్ అఫ్గాన్‌న తక్కువ పరుగులకే పరిమితం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కమిన్స్ టీ 20 ఫార్మాట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రెండు రోజుల తర్వాత టీ20ల చరిత్రలో వరుసగా రెండు హ్యాట్రిక్ నమోదు చేసి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 18వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్ వికెట్‌ను కమిన్స్ పడగొట్టాడు. ఆ తర్వాత 20వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో కరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను కమిన్స్ అవుట్ చేశాడు. ఈ బ్యాటర్లందరూ క్యాచ్ అవుట్‌లు ఇచ్చే అవుటయ్యారు. వార్నర్ మరో క్యాచ్ అందుకుంటే కమిన్స్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచేవారు. కమిన్స్ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి అఫ్గాన్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్ జారవిడిచాడు. దీంతో వరుసగా నాలుగో వికెట్ దక్కించుకునే అవకాశం కమిన్స్ చేజారింది.
దిగ్గజాల సరసన…
టీ 20 ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన కమిన్స్… ఈ ఘనత సాధించిన శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ, న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌతీ, సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిచ్, మాల్టాకు చెందిన ఆటగాళ్ల సరసన నిలిచాడు. అఫ్గాన్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారని,… వారిని బౌండరీలు కొట్టకుండా ఆపాలని భావించామని అందులో భాగంగానే హ్యాట్రిక్ వచ్చిందని కమిన్స్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో 142 పరుగుల సవాల్ విసిరే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కంగారులు 127 పరుగులకే కుప్పకూలారు . దీంతో ఆసిస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారగా… అఫ్గాన్ అవకాశాలు పెరిగాయి.
మరిన్ని చూడండి